తన కోపమే తన శత్రువు
ABN , Publish Date - Feb 17 , 2026 | 12:10 AM
8 నిమిషాల కోపం మన రక్తనాళాలను గంట పాటు పక్షవాతానికి లోను చేసి, గుండెపోటు ముప్పును పెంచుతుంది. కోపానికీ...
పరిశోధన
8 నిమిషాల కోపం మన రక్తనాళాలను గంట పాటు పక్షవాతానికి లోను చేసి, గుండెపోటు ముప్పును పెంచుతుంది. కోపానికీ గుండెపోటుకూ మధ్య నెలకొని ఉండే అవినాభావ సంబంధమిది. మరిన్ని వివరాలు...
8 నిమిషాల కోపం మన ప్రసరణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఒక అధ్యయనంలో భాగంగా 250 మంది మీద చేపట్టిన ఒక ప్రయోగంలో, కోపాన్ని పెంచే జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నప్పుడు వాళ్లలో రక్తనాళాల వ్యాకోచ లక్షణం 50 శాతానికి క్షీణించినట్టు, ఆ పరిస్థితి ఏకంగా 40 నిమిషాల పాటు కొనసాగినట్టు పరిశోధకులు గుర్తించారు. విషాదం, ఆందోళనలకు గురైనప్పుడు రక్తప్రసరణ వ్యవస్థ చెక్కుచెదరకపోయినా కోపానికి లోనైనప్పుడు రక్తనాళాల్లోని అంతర్గత పొర ఎండోథీలియం బిగుసుకుపోయి, సాగే గుణాన్ని కోల్పోయి, రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నట్టు వారు కనిపెట్టారు. అయితే అరుదుగా కోపానికి గురవడం వల్ల తీవ్ర ప్రభావం లేకపోయినా, పదే పదే కోపానికి లోనవడం వల్ల రక్తనాళాలు పదే పదే రక్తప్రవాహానికి అవరోధాలు కల్పిస్తూ అంతిమంగా గుండె మీద దుష్ప్రభావాన్ని కనబరిచే ప్రమాదం ఉందనీ, కాబట్టి భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యానికీ శ్రేయస్కరమనీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన నిపుణులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు..
ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్
Read Latest Telangana News And AP News And Telugu News