Share News

పసందైన ప్రొటీన్‌

ABN , Publish Date - Feb 17 , 2026 | 02:39 AM

కండర నిర్మాణానికీ, వ్యాధినిరోధకశక్తి మెరుగుదలకూ, కణజాల మరమ్మత్తుకూ, ఎంజైమ్స్‌, హార్మోన్స్‌ ఉత్పత్తికీ ప్రొటీన్లు అవసరం. కాబట్టి ప్రతి రోజూ తినే ఆహారం ద్వారా...

పసందైన ప్రొటీన్‌

ప్రొటీన్‌ వంటకాలు

కండర నిర్మాణానికీ, వ్యాధినిరోధకశక్తి మెరుగుదలకూ, కణజాల మరమ్మత్తుకూ, ఎంజైమ్స్‌, హార్మోన్స్‌ ఉత్పత్తికీ ప్రొటీన్లు అవసరం. కాబట్టి ప్రతి రోజూ తినే ఆహారం ద్వారా సాధ్యమైనంత ఎక్కువ ప్రొటీన్‌ పొందే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకోసం 20 గ్రాముల ప్రొటీన్‌ను అందించే పదార్థాల గురించి తెలుసుకుందాం!

ప్రొటీన్‌ ప్రయోజనాల గురించి తెలిసినా, సరిపడా ప్రొటీన్‌ను పదార్థాల ద్వారా ఎలా పొందాలో, ప్రొటీన్‌ పుష్కలంగా ఉండే వంటకాలను ఎలా తయారుచేసుకోవాలో అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. అయితే నిజానికి తక్కువ శ్రమతో ఎక్కువ ప్రొటీన్‌ను అందించే వంటకాలు చాలా ఉన్నాయి. అవేంటంటే...

పన్నీర్‌: వంద గ్రాముల పన్నీర్‌తో 20 గ్రాముల ప్రొటీన్‌ దక్కుతుంది. అందుకోసం పచ్చి పన్నీర్‌ తినొచ్చు. లేదా గ్రిల్‌ చేసి, కూరల్లో కలుపుకుని, సలాడ్‌ రూపంలో, పరోటాలతో కలిపి తినొచ్చు

ఉడకబెట్టిన గుడ్లు: మూడు పెద్ద గుడ్లతో 20 గ్రాముల ప్రొటీన్‌ పొందవచ్చు. త్వరగా ప్రొటీన్‌ పొందే వీలున్న సులభమైన మార్గమిది. కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌ లేదా ఈవినింగ్‌ స్నాక్‌గా గుడ్లు తీసుకోవచ్చు

చికెన్‌ బ్రెస్ట్‌: వంద గ్రాముల చికెన్‌ బ్రెస్‌లో 20 నుంచి 22 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. తక్కువ కొవ్వును కలిగి ఉండే ఈ ప్రొటీన్‌ సోర్స్‌ను కండర సాంద్రతను పెంచుకోవాలనేవారు, బరువు తగ్గించుకోవాలనుకునేవారూ ఎంచుకోవచ్చు

ఉడికించిన పప్పు: కందులు, పెసలు, బొబ్బర్లు ఏవైనా ప్రొటీన్‌ వనరులే! కాబట్టి ఒకటిన్నర కప్పు పప్పుతో 18 నుంచి 20 గ్రాముల ప్రొటీన్‌ పొందే ప్రయత్నం చేయాలి. పప్పును క్వినోవా, అన్నంతో కలిపి తినొచ్చు

గ్రీక్‌ యోగర్ట్‌: 200 గ్రాముల గ్రీక్‌ యోగర్ట్‌లో 20 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. అయితే ఈ యోగర్ట్‌ తీయగా ఉండకూడదు. దీన్ని సాదాగా లేదా పండ్లతో కలిపి తినొచ్చు

సోయా: 50 గ్రాముల సోయా చంక్స్‌ 20 గ్రాముల ప్రొటీన్‌ను అందిస్తాయి కాబట్టి కూరగాయలతో కలిపి కూరగా వండుకోవచ్చు

ప్రొటీన్‌ షేక్‌: వే లేదా వృక్షాధారిత ప్రొటీన్‌ షేక్స్‌ తీసుకోవచ్చు. అందుకోసం ఒక స్కూప్‌ ప్రొటీన్‌ పౌడర్‌ను నీళ్లు లేదా పాలతో కలిపి తీసుకోవాలి


మరిన్ని చిట్కాలు

  • బ్రేక్‌ఫా్‌స్టలో పన్నీర్‌ లేదా ఉడకబెట్టిన గుడ్లు తినాలి

  • వేయించిన సెనగలు లేదా గ్రీక్‌ యోగర్ట్‌ లేదా ప్రొటీన్‌ స్మూదీలను స్నాక్‌గా తీసుకోవచ్చు

  • దాల్‌, సోయా, లేదా మొలకలను లంచ్‌ లేదా డిన్నర్‌లో చేర్చుకోవచ్చు

  • క్వినోవా లేదా మిల్లెట్స్‌ను పప్పుతో కలిపి తీసుకోవచ్చు

  • చియా, అవిసె గింజలను సలాడ్స్‌లో లేదా పెరుగులో కలిపి తినొచ్చు

కేవలం వ్యాయామాలు చేసేవాళ్లు మాత్రమే ప్రొటీన్‌ తీసుకోవాలన్నది అపోహ మాత్రమే! ప్రొటీన్‌ ప్రతి ఒక్కరికీ అవసరమే! కాబట్టి సరైన పదార్థాలను ఎంచుకుంటే ప్రొటీన్‌ సరిపడా అందుతుంది. మూడు భోజనాల్లో ప్రొటీన్‌ సమంగా ఉండేలా చూసుకోవాలి. లేదా కనీసం ఒక భోజనంలోనైనా ప్రొటీన్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రొటీన్‌ సరిపడా తీసుకున్నప్పుడు రోజంతా హుషారుగా, చలాకీగా, దృఢంగా, అన్నిటికీ మించి ఆరోగ్యంగా ఉండగలుగుతాం!

ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు..

ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 17 , 2026 | 02:39 AM