Share News

చిన్న పొదుపు.. పెద్ద లాభం

ABN , Publish Date - Feb 18 , 2026 | 05:17 AM

ఇంటిని నడపడం ఒక కళ అయితే, అందులో పొదుపు చేయడం ఒక తెలివైన పని. రూపాయి రూపాయి కలిస్తేనే కదా....

చిన్న పొదుపు.. పెద్ద లాభం

ఇంటిని నడపడం ఒక కళ అయితే, అందులో పొదుపు చేయడం ఒక తెలివైన పని. రూపాయి రూపాయి కలిస్తేనే కదా కొండంత అండ. మీ ఇంటి బడ్జెట్‌ను స్మార్ట్‌గా ప్లాన్‌ చేసుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి.

జాబితా సిద్ధం చేసుకోండి: కిరాణా సామాను కొనడానికి వెళ్లే ముందు ఇంట్లో ఏమున్నాయో చూసుకుని లిస్ట్‌ రాసుకోండి. దీనివల్ల అనవసరమైన వస్తువులు కొనడం తగ్గుతుంది. ఆకలిగా ఉన్నప్పుడు షాపింగ్‌కు వెళ్లకండి. అప్పుడు ఎక్కువ జంక్‌ఫుడ్‌ కొనే అవకాశం ఉంటుంది.

విద్యుత్‌ ఆదా: గది నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫ్యాన్లు, లైట్లు కట్టేయడం అలవాటు చేసుకోండి. ఏసీ లేదా గీజర్‌ వాడకాన్ని అవసరానికి మించి తగ్గించడం వల్ల నెలవారీ కరెంటు బిల్లులో గణనీయమైన మార్పు కనిపిస్తుంది.

బ్రాండెడ్‌ వస్తువులే వద్దు: కొన్నిసార్లు లోకల్‌ మార్కెట్‌లో దొరికే నాణ్యమైన వస్తువులు కూడా బ్రాండెడ్‌ వస్తువుల కంటే తక్కువ ధరకు వస్తాయి. ప్యాకేజింగ్‌ చూసి మోసపోకుండా నాణ్యతను గమనించండి.

పిగ్గీబ్యాంకు అలవాటు: ప్రతి రోజు మిగిలిన చిల్లరను ఒక డబ్బాలో వేయడం అలవాటు చేసుకోండి. ఏడాది చివర్లో అది పెద్ద మొత్తంగా మారి అత్యవసరాలకు ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియా కథ ముగిసినట్లేనా?

ఇమ్రాన్ ఖాన్‌కు అనారోగ్యం.. పాక్ ప్రభుత్వానికి కపిల్ దేవ్, సునీల్ గావస్కర్ లేఖ

Updated Date - Feb 18 , 2026 | 05:17 AM