Home » Navya » Health Tips
బియ్యం తెల్లగా ఉండటం మాత్రమే తెలిసినవారు నల్లబియ్యాని చూసి కాస్త ఆశ్చర్యపోతారు. బియ్యం రంగులో తేడాలు ఉన్నట్టే, అందులోని పోషకాల పరంగానూ తేడాలుంటాయి. బియ్యాన్ని తెలుపు, పసుపు, నలుపు రంగుల్లో చూసినవారైతే మాత్రం నల్ల బియ్యంతో కలిగే ఉపయోగాలు కచ్చితంగా తెలుసుకోవాలి. బ్లాక్ రైస్‌లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆంథోసైనిన్స్ ఇవి క్యాన్సర్, గుండె జబ్బులను తగ్గిస్తాయి.
ఎముక ఆరోగ్యానికి కూడా అలూ బుఖారా పండ్లు సహకరిస్తుంది. అలూ బుఖారా పండ్లలో ప్రత్యేకమైన ఫైటోన్యూట్రియెంట్లు, నియోక్ క్లోరోజెనిక్ యాసిడ్ వంటి క్యాన్సర్ నిరోధక ఏజెంట్లను కలిగి ఉంది.
ముల్లంగి ఆకులు, వేరు రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది. ఆకులు ఎపికాటెచిన్ వంటి ఫ్లెవనాల్‌లను సరఫరా చేస్తాయి. ముల్లంగిలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది ఫైటోన్యూట్రియెంట్‌లతో కలిసి, వృద్ధాప్యం లేదా అనారోగ్యకరమైన జీవనశైలి హానికరమైన ప్రభావాల నుంచి శరీర కణాలను రక్షించడంలో సహాయపడుతుంది.
వెచ్చని టీ శక్తిని పెంచుతుంది. రోజంతా తాజాగా ఉంచుతుంది. మనం తీసుకునే కొన్ని మూలికా టీలు శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు పంపేందుకు సహకరిస్తాయి. ఉదయాన్నే టీ తీసుకోవడం అనేది మనలో చాలామందికి అలవాటు.
సాల్మన్, ట్యూనా, సార్టినెస్ వంటి జిడ్డు చేపల ద్వారా పొందవచ్చు. చియా, అవిసె గింజలు, వాల్ నట్స్ లోనూ ఒమేగా 3 ఉంటుంది. ఈ కొవ్వు ఆమ్లాలు శరీరంలో రకరకాల విధులకు అవసరం. ఇవి మెదడు, గుండె పనితీరును పెంచుతాయి.
అవిసె గింజల్లో ఒమేగా కొవ్వులు, లిగ్నాన్స్ అధికంగా ఉన్నాయి. ఇవి ఎముక బలాన్ని పెంచుతాయి. అవిసె గింజలు ఎముక శక్తిని, ఎముకలు దృఢంగా మారేందుకు ఖనిజ పదార్థాన్ని పెంచుతుంది. ఇందులో ఉండే లినోలెనిక్ యాసిడ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఎముక నష్టం, బోలు ఎముక వ్యాధిని తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈస్ట్రోజెన్ కీలక పాత్ర పోషిస్తుంది.
ఆందోళన, ఒత్తిడితో ఉన్నప్పుడు శరీరం ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటుంది. ఇది హైపర్ వెంటిలేషన్‌కు దారితీస్తుంది. ముక్కుకు బదులు నోటితో శ్వాసను తీసుకుంటాం. నోటి ద్వారా గాలి తీసుకోవడం వల్ల కూడా నోటిలో తేమ ఆవిరై నోరు పొడిబారుతుంది.
ప్రతి 100 మందిలో 8 మందికి ఏదో ఒక దశలో నిద్ర పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి మాత్రమే జరగవచ్చు, లేదా తరచుగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ పక్షవాతం కౌమారదశ నుంచి మొదలవుతుంది.
బీట్ రూట్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కేలరీల విషయానికి వస్తే ఇందులో తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గించడానికి సరైన ఆహారంగా పనిచేస్తుంది. హిమోగ్లోబిన్ పెంచేందుకు సహకరిస్తుంది. సలాడ్, సూప్‌లలో ఓట్స్, బీట్ రూట్ మసాలా దోశ చక్కని అల్పాహారంగా ఉంటుంది.
వెన్నలో విటమిన్లు ఎ, డి, ఇ, కె పుష్కలంగా ఉన్నాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి సహకరిస్తాయి. వెన్న తినడం వల్ల తక్షణమే శరీరానికి కావలసిన శక్తి అందుతుంది.