స్మార్ట్ కిచెన్... హ్యాపీ కుకింగ్
ABN , Publish Date - Feb 19 , 2026 | 01:56 AM
వంటింట్లో గంటల తరబడి శ్రమపడకుండా, పనులను చిటికెలో పూర్తి చేసేందుకు కొన్ని చిట్కాలు తెలిస్తే చాలు. మీ వంటను రుచికరంగా, మీ పనిని...
వంటింట్లో గంటల తరబడి శ్రమపడకుండా, పనులను చిటికెలో పూర్తి చేసేందుకు కొన్ని చిట్కాలు తెలిస్తే చాలు. మీ వంటను రుచికరంగా, మీ పనిని సులభంగా మార్చే కిచెన్ హ్యాక్స్ ఇవే..
ఉల్లి కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా: ఉల్లిపా యలను కోయడానికి 15 నిమిషాల ముందు ఫ్రిజ్‌లో పెట్టండి. లేదంటే వాటి తొక్క తీసి నీళ్లలో ఉంచండి. దీనివల్ల ఘాటు తగ్గి కళ్లలో నీళ్లు రావు.
మెత్తని ఇడ్లీల కోసం: ఇడ్లీపిండి రుబ్బేటప్పుడు అందులో గుప్పెడు అటుకులు లేదంటే కొంచెం అన్నం కలిపి రుబ్బితే ఇడ్లీలు మెత్తగా వస్తాయి.
బియ్యంలో పురుగులు పట్టకుండా: బియ్యం లేదా పప్పులు నిల్వచేసే డబ్బాల్లో కొన్ని ఎండు మిరపకాయలు లేదా బిర్యానీ ఆకులు వేస్తే పురుగులు పట్టవు.
ఇవి కూడా చదవండి
టెక్నాలజీ కూడా కాపీ-పేస్టే... రోబో డాగ్ వివాదంపై సిద్ధరామయ్య