మీ ఇల్లు చల్లగా ఉండాలంటే
ABN , Publish Date - Feb 23 , 2026 | 05:34 AM
ఏసీలు, కూలర్లు ఉన్నా సహజ సిద్ధమైన పద్ధతుల్లో ఇంటిని చల్లగా ఉంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతతోపాటు విద్యుత్ కూడా ఆదా అవుతుంది...
ఏసీలు, కూలర్లు ఉన్నా సహజ సిద్ధమైన పద్ధతుల్లో ఇంటిని చల్లగా ఉంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతతోపాటు విద్యుత్ కూడా ఆదా అవుతుంది.
లైట్ కర్టెన్స్: కిటికీలకు చిక్కటి రంగు తెరలు కాకుండా లేత రంగు కాటన్ తెరలు వాడితే గదిలోకి వేడి రాదు.
ఇండోర్ ప్లాంట్స్: స్నేక్‌ప్లాంట్, మనీప్లాంట్, అలోవెరా వంటివి ఇంట్లో పెంచడం వల్ల ఆక్సిజన్ పెరిగి చల్లదనం లభిస్తుంది.
వెంటిలేషన్: సాయంత్రం వేళల్లో కిటికీలు తెరిచి ఉంచడం వల్ల గాలి మారుతుంది. మధ్యాహ్నం మాత్రం కిటికీలు మూసి ఉంచడం శ్రేయస్కరం.
మట్టి కుండలు: ఫ్రిజ్ నీళ్ల కంటే మట్టి కుండలోని నీటిని తాగడం గొంతుకు, శరీరానికి ఎంతో మంచిది.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీవారి లడ్డూలో నెయ్యికి బదులు రసాయనాలు కలిపారు.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం..
కొందరు జర్నలిస్టులు మా మాటలను వక్రీకరిస్తున్నారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజం
Read Latest Telangana News And AP News And Telugu News