ఆఫీసులో మీ ముద్ర
ABN , Publish Date - Feb 19 , 2026 | 01:58 AM
ఉద్యోగం చేసే మహిళలకు ఇంటిని, ఆఫీసును బ్యాలెన్స్ చేయడం కత్తిమీద సామే. ఆఫీసులో మీ పనితీరు మెరుగుపడటానికి, ఒత్తిడిని...
ఉద్యోగం చేసే మహిళలకు ఇంటిని, ఆఫీసును బ్యాలెన్స్ చేయడం కత్తిమీద సామే. ఆఫీసులో మీ పనితీరు మెరుగుపడటానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి.
టు డు లిస్ట్:
ఆఫీసుకు వెళ్లగానే ఆ రోజు చేయాల్సిన పనులను ప్రాధాన్య క్రమంలో రాసుకోండి. దీనివల్ల ఏ పని ఎప్పుడు పూర్తిచేయాలో స్పష్టత ఉంటుంది. హడావుడి తగ్గుతుంది.
నో చెప్పడం నేర్చుకోండి:
మీ శక్తికి మించిన పనిని లేదా మీకు సంబంధం లేని పనులను సున్నితంగా తిరస్కరించడం నేర్చుకోండి. ఇది మీ పని నాణ్యతను పెంచుతుంది.
నిరంతర అభ్యాసం:
మీ రంగంలో వస్తున్న కొత్త మార్పులను గమనిస్తూ ఉండండి. ఖాళీ సమయాల్లో ఆన్‌లైన్ కోర్సులు చేయడం వల్ల ప్రమోషన్లు రావడానికి, కెరీర్‌లో ఎదగడానికి అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి
టెక్నాలజీ కూడా కాపీ-పేస్టే... రోబో డాగ్ వివాదంపై సిద్ధరామయ్య