Share News

కాళ్ల నొప్పులా?

ABN , Publish Date - Feb 19 , 2026 | 02:03 AM

వంటింట్లోని పనులు ఎక్కువమంది నిలబడే చేస్తూ ఉంటారు. దీని వల్ల శరీరపు బరువు అంతా కాళ్లపై పడుతుంది. దీని వల్ల నెప్పులు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న మార్పుల...

కాళ్ల నొప్పులా?

నేను ఒక హౌస్‌వై్‌ఫని. ప్రతి రోజు నాలుగైదు గంటలు కిచెన్‌లో గడపాల్సి ఉంటుంది. దీనివల్ల నాకు కాళ్లు నెప్పులు వస్తున్నాయి. వీటి నివారణకు ఏదైనా మార్గముందా?

వంటింట్లోని పనులు ఎక్కువమంది నిలబడే చేస్తూ ఉంటారు. దీని వల్ల శరీరపు బరువు అంతా కాళ్లపై పడుతుంది. దీని వల్ల నెప్పులు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న మార్పుల ద్వారా ఈ నెప్పులను నివారించు కోవచ్చు. ఉదాహరణకు కూరలు తరగటం.. వంట వండటం వంటి పనుల మధ్యలో కొద్ది సేపు కూర్చోవటంవల్ల మన శరీరంలో కండరాలకు కొంత విశ్రాంతి దొరుకుతుంది. చిన్న చిన్న చిట్కాల ద్వారా నొప్పులను నివారించుకోవటం ఎలాగో తెలుసుకుందాం.

  • కూరలు తరిగేటప్పుడు చాలామంది నిలబడతారు. కుర్చీ లేదా స్టూల్‌ మీద కూర్చుని తరిగితే కండరాలకు విశ్రాంతి దొరుకుతుంది.

  • వంటిల్లు పెద్దగా ఉంటే ఒక టేబుల్‌ను వేసుకొని కూర్చుని తరిగితే ఎక్కువ శ్రమ అనిపించదు.

  • ప్రస్తుతం మార్కెట్లో కిచెన్‌ టాప్‌పై వేసుకొని మ్యాట్స్‌ వచ్చాయి. వీటిపై పెడితే కటింగ్‌ బోర్డు కదలదు. దీని వల్ల కట్‌ చేయటం సులభమవుతుంది.

  • మనం ఎక్కువగా వాడే వస్తువులు కిచెన్‌ టాప్‌పైనే పెట్టుకోవాలి. దీని వల్ల వాటిని వాడటం సులభమవుతుంది.

  • ప్రతి 30 నిమిషాలకు ఒక సారి తప్పనిసరిగా 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. వీలైతే కాలి వేళ్లను కదపటం వంటి చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు చేస్తే మంచిది.

  • వీలైనంత వరకు గిన్నెలను, బరువైన ఇతర సామగ్రిని ఒక చేతితో ఎత్తకూడదు. రెండు చేతులు ఉపయోగించాలి. దీని వల్ల శరీరంపై ఎక్కువ ఒత్తిడి ఉండదు.

  • చాలా మంది వాడిన గిన్నెలన్నింటినీ సింక్‌లో వేసేసి ఒకే సారి తోముతారు. దీనివల్ల పని అయిపోయిన తర్వాత కూడా నిలబడాల్సి వస్తుంది. అలా కాకుండా వాడిన గిన్నెలను ఎప్పటికప్పుడు తోమితే బావుంటుంది. ఎప్పుడైనా ఎక్కువగా నొప్పి అనిపిస్తే ఐస్‌ ప్యాక్‌ పెట్టుకోవాలి.

ఇవి కూడా చదవండి

టెక్నాలజీ కూడా కాపీ-పేస్టే... రోబో డాగ్ వివాదంపై సిద్ధరామయ్య

Updated Date - Feb 19 , 2026 | 02:03 AM