చిన్న గాయాలకు ఇంటి వైద్యం
ABN , Publish Date - Feb 19 , 2026 | 02:01 AM
అకస్మాత్తుగా ఏదైనా దెబ్బ తగిలినా, అనారోగ్యం చేసినా కంగారు పడకుండా ఉండటానికి ప్రథమ చికిత్స బాక్స్ సిద్ధంగా ఉండాలి. అత్యవసర...
అకస్మాత్తుగా ఏదైనా దెబ్బ తగిలినా, అనారోగ్యం చేసినా కంగారు పడకుండా ఉండటానికి ప్రథమ చికిత్స బాక్స్ సిద్ధంగా ఉండాలి. అత్యవసర సమయంలో ఇది మీకు ఎంతగానో సహాయపడుతుంది.
కాలిన గాయాలకు: వంట చేసేటప్పుడు చేయి కాలితే వెంటనే ఆ ప్రదేశాన్ని చల్లని నీటి కింద ఉంచండి. ఐస్ ముక్కలను నేరుగా పెట్టకండి. దానివల్ల కణజాలం దెబ్బతింటుంది. అలోవెరా జెల్ రాయడం మంచిది.
పురుగు కుడితే: ఏదైనా పురుగు కుట్టినప్పుడు ఆ ప్రదేశంలో కొంచెం ఉల్లిపాయ ముక్కను రుద్దండి. లేదా తడిసున్నం పెట్టండి. ఇది విష ప్రభావాన్ని నివారించి నొప్పిని తగ్గిస్తుంది.
అరుగుదల సమస్య: కడుపు ఉబ్బరంగా లేదా అజీర్తిగా అనిపిస్తే కొంచెం వాము, చిటికెడు ఉప్పు కలిపి గోరు వెచ్చటి నీటితో తీసుకోండి. ఇది తక్షణ ఉపశమనం ఇస్తుంది.
ఇవి కూడా చదవండి
టెక్నాలజీ కూడా కాపీ-పేస్టే... రోబో డాగ్ వివాదంపై సిద్ధరామయ్య