కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు సంగీత్ సాగర్ కన్నుమూశారు. షూటింగ్ సందర్భంగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
సుష్మా స్మరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా గతకొద్దిరోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 73 ఏళ్ల వయసులో గురువారం చనిపోయారు.
బీజాపూర్ ప్రాంతంలో బుధవారం ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 20కి పెరిగింది.
బెంగాల్‌లో బాబ్రీ మసీదు నిర్మిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన తృణమూల్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని టీఎమ్‌సీ నేత, కోల్‌కతా మేయర్ ఫర్హాద్ హకీమ్ తెలిపారు.
గవర్నర్ ఆర్.ఎన్.రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ కొందరు సమాజంలోని ప్రజల మధ్య భయాందోళనలు రేకెత్తిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలాలు మారేకొద్దీ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ తమిళనాడు రాష్ట్రంలో కొందరు మాట్లాడుతున్నారంటూ ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర సంచలనానికి దారితీశాయి..
తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక ప్రదేశం అయిన ఊటీలో వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు ప్రదేశాల్లో ఈ వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ఊటీలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించారు. వాటర్ బాటిళ్లు ఎక్కడా కనిపించవు. అయితే.. పర్యాటకుల కోసం ఈ వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు.
నేవీ డేను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ నావికాదళ సిబ్బందికి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పట్టుదల, పరాక్రమానికి నేవీ పర్యాయపదమని ప్రశంసించారు.
చెన్నై శివారు ప్రాంతాలన్నీ.. ఇంకా.. జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ‘దిత్వా’ తుఫాను వల్ల రాజధాని చెన్నైతోపాటు శివారు ప్రాంతాలన్నీ తడిసి ముద్దయిపోయాయి. తుపాన్ వల్ల జనజీవనం ఎక్కడికక్కడే స్థంభించిపోయింది. ప్రజానీకం ఇళ్లనుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
కేరళలోని కొట్టాయం ప్రాంతంలో అంతర్రాష్ట్ర బస్సులో తరలిస్తున్న రూ.72 లక్షలను ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఏపీకి చెందిన షేక్ జాఫర్, పాషాస్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
సిబ్బంది కొరత తలెత్తడంతో ఇండిగో ఫ్లైట్ సర్వీసుల్లో తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ఫ్లైట్ డ్యూటీకి సంబంధించిన కొత్త నిబంధనలు సిబ్బంది కొరతకు దారి తీసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కస్టమర్లకు ఇండిగో క్షమాపణలు చెప్పింది. త్వరలో పరిస్థితులు సర్దుకుంటాయని వెల్లడించింది.