Share News

ప్రయాగ్‌రాజ్‌లో ముగిసిన మాఘ మేళా

ABN , Publish Date - Feb 16 , 2026 | 04:05 AM

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన మాఘ మేళా ఆదివారం ముగిసింది. మౌనీ అమావాస్య సందర్భంగా జనవరి 18న ప్రారంభమైన ఈ మేళాకు శివరాత్రి పర్వదినం ముగింపు రోజు కావడం గమనార్హం.

ప్రయాగ్‌రాజ్‌లో ముగిసిన మాఘ మేళా

  • చివరి రోజున 40 లక్షల మంది పుణ్యస్నానాలు

ప్రయాగ్‌రాజ్‌, ఫిబ్రవరి 15: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన మాఘ మేళా ఆదివారం ముగిసింది. మౌనీ అమావాస్య సందర్భంగా జనవరి 18న ప్రారంభమైన ఈ మేళాకు శివరాత్రి పర్వదినం ముగింపు రోజు కావడం గమనార్హం. చివరి రోజున 40లక్షల మందికిపైగా భక్తులు పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. ఈ ఏడాది మాఘ మేళాకు మొత్తం 22 కోట్ల మంది భక్తులు వచ్చారని జిల్లా కలెక్టర్‌ మనీష్‌ కుమార్‌ వర్మ చెప్పారు. 2013లో జరిగిన కుంభమేళా కన్నా ఎక్కువ మంది వచ్చారని తెలిపారు. మౌనీ అమావాస్యనాడు గంగలో మునక వేయకుండా జగద్గురు శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతిని అధికారులు అడ్డుకోవడం ఈ ఏడాది ప్రధాన సంఘటనగా నిలిచింది. రద్దీ అధికంగా ఉన్న కారణంగా ఎక్కువ మంది అనుచరులతో వెళ్లకూడదంటూ అడ్డగించారు. దాంతో సంప్రదాయం ప్రకారం స్నానం చేయకుండానే ఆయన వెనుదిరిగారు.

Updated Date - Feb 16 , 2026 | 04:05 AM