Share News

విమానంలో బిగ్గరగా పాటలు వింటే చర్యలు

ABN , Publish Date - Feb 16 , 2026 | 04:06 AM

విమాన ప్రయాణాల్లో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తూ, ఇయర్‌ ఫోన్లు లేకుండా బిగ్గరగా పాటలు వినేవారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది.

విమానంలో బిగ్గరగా పాటలు వింటే చర్యలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: విమాన ప్రయాణాల్లో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తూ, ఇయర్‌ ఫోన్లు లేకుండా బిగ్గరగా పాటలు వినేవారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. ఇలాంటి సందర్భాల్లో సదరు ప్రయాణికుడిని ‘అన్‌రూలీ ప్యాసెంజర్‌’ (క్రమశిక్షణలేని ప్రయాణికుడు)గా పరిగణించి విమానం నుంచి దించేయడం లేదా భవిష్యత్తులో ప్రయాణించకుండా నిషేధించడం వంటి చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు విమానయాన శాఖ సహాయమంత్రి మురళీధర్‌ మోహోల్‌ సమాధానమిస్తూ, క్రమశిక్షణారహితంగా ప్రవర్తించే ప్రయాణికులపై చర్యలు తీసుకునేందుకు ఎయిర్‌క్రాఫ్ట్‌ రూల్స్‌1937 కింద ఇప్పటికే నిబంధనలు ఉన్నాయని చెప్పారు. ముందస్తు అనుమతి లేకుండా విమానాశ్రయాల్లో, విమానంలో ఉన్నప్పుడు ఫొటోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని ఆయన గుర్తుచేశారు.

Updated Date - Feb 16 , 2026 | 04:06 AM