ప్యాకేజ్డ్ ఆహారంపై ‘హెచ్చరిక’ ఉండాల్సిందే!
ABN , Publish Date - Feb 16 , 2026 | 04:18 AM
ప్రజల ఆరోగ్యంతో ఆటలాడొద్దని సుప్రీంకోర్టు ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏను హెచ్చరించింది. ఆరోగ్యం ప్రజల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది..
ఆరోగ్యం ప్రాథమిక హక్కు.. రాజీపడే ప్రసక్తే లేదు
ఎఫ్‌ఎస్‌ఎస్ ఏఐకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్యంతో ఆటలాడొద్దని సుప్రీంకోర్టు ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏను హెచ్చరించింది. ఆరోగ్యం ప్రజల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. ప్రజారోగ్యం విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని తేల్చిచెప్పింది. ఇకపై ప్యాకేజ్డ్ ఆహారంపై ‘హెచ్చరిక’ ముద్ర తప్పనిసరిగా ఉండాల్సిందేని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ)ను ఆదేశించింది. ప్యాకెట్లలోని ఆహారంలో అధిక చక్కెర, ఉప్పు, కొవ్వుకు సంబంధించి వినియోగదారుడికి అర్థమయ్యేలా ప్యాకెట్ ముందు భాగంలోనే స్పష్టమైన హెచ్చరికల లేబుళ్లు తప్పనిసరి చేయాలని పేర్కొంది. ప్యాకేజ్డ్ ఫుడ్‌కు సంబంధించి ‘3ఎస్ అండ్ అవర్ హెల్త్ సొసైటీ’ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు ఇచ్చింది. ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో చక్కెర, ఉప్పు, కొవ్వు పదార్థాలు ఎంతమేర ఉన్నాయో తెలిపే ‘ముందు వైపు హెచ్చరిక లేబుళ్ల’ విషయంలో ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ దాఖలు చేసిన అఫిడవిట్‌పై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్యాకెట్లపై స్పష్టమైన హెచ్చరికలు ఉండాలని పేర్కొంది. పిటిషనర్ తరఫు న్యాయవాదివాదిస్తూ.. ప్యాకెట్లపై చక్కెర, సోడియం, కొవ్వుల మోతాదు గురించి బోల్డ్ అక్షరాలతో హెచ్చరికలు ఉంటేనే ప్రజలు అప్రమత్తం అవుతారని కోర్టుకు తెలిపారు. ఈ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. కేవలం చర్చలు, సమావేశాలతో కాలక్షేపం చేయొద్దని ఎఫ్‌ఎ స్‌ఎ్‌సఏఐకి సూచించింది. ఈ అంశానికి సంబంధించి 4వారాల్లో సమగ్ర నివేదికతో రావాలని ఆదేశించింది.