తీవ్ర విషాదం.. బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురి మృతి
ABN , Publish Date - Feb 16 , 2026 | 10:15 AM
బెంగుళూరు శివారు తమకూరు రోడ్డులోని జిందాల్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. కేఎస్ఆర్టీసీ బస్సును కారు ఢీకొని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు(Bangalore)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేఎస్ఆర్టీసీ బస్సును కారు ఢీకొని ఐదుగురు మృతిచెందారు. ఈ ఘటన బెంగళూరు శివారు తుమకూరు రోడ్డులోని జిందాల్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమకూరు నుంచి బెంగళూరు వైపు వెళుతున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కేఎస్ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్సపొందుతూ అతను మరణించాడు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం నేలమంగళ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.
ఈ వార్తలు కూడా చదవండి..
పంచాయతీరాజ్ ఉద్యోగి ఆస్తులపై ఏసీబీ రైడ్స్.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు..
రాజమండ్రిలో పెద్ద పులి భయం.. ఫారెస్ట్ బృందం చర్యలు
Read Latest Telangana News And AP News And Telugu News