ఏటా రెండుసార్లు గడియారాల్లో సమయాన్ని మార్చే విధానానికి స్వస్తి పలికేందుకు అమెరికా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. 'డేలైట్ సేవింగ్ టైమ్'ను ఏడాది పొడవునా శాశ్వతం చేయడం కోసం ప్రవేశపెట్టిన ‘సన్‌షైన్ ప్రొటెక్షన్ యాక్ట్’ బిల్లుకు అక్కడి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.
ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో చిక్కుకుపోయింది. బయటకు రాలేని పరిస్థితిలో 9 రోజుల పాటు నరకం చూసింది. 9 రోజుల తర్వాత సోదరుడి పుణ్యమా అని ప్రాణాలతో బయటపడింది.
హోర్ముజ్‌లో టోల్ ఫీజు విధింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కు తగ్గారు. అమెరికాతో భారీ వాణిజ్యం, పెట్టుబడుల కోసం గల్ఫ్ దేశాలతో కుదుర్చుకోనున్న ఒప్పందాలతో టోల్ ఫీజును భర్తీ చేయనున్నట్టు చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ మొజ్తాబా ఖమేనీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మొజ్తాబా బతికిలేడనడానికి 90 శాతం అవకాశం ఉందని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. హోర్ముజ్‌లో భద్రత కల్పించే బాధ్యతను మళ్లీ తాము భుజానికెత్తుకుంటామని అన్నారు.
ఇరాన్‌లోని సబ్‌మెరైన్, యుద్ధ నౌకల మరమ్మతుల కేంద్రంపై అమెరికా దాడి చేసింది. పలు సముద్రపు డ్రోన్లతో ఈ దాడి చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా తెలిపింది.
అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ ముదురుతున్నాయి. గతంలో శాంతి స్థాపన కోసం అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని అమలు చేసేది లేదని ఇరాన్ తాజాగా తేల్చిచెప్పింది.
అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన మహిళ భర్త చేతిలో హత్యకు గురైంది. భర్త ఆమెను తుపాకితో కాల్చి చంపాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. తనపై హత్యాయత్నం చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తే, ఆ దేశంపై క్షిపణుల వర్షం తప్పదని వార్నింగ్ ఇచ్చారు.
హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్‌ను అమెరికా హెచ్చరించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.