భారత్, చైనాలు నరకాలు కావు.. మానవాళికి మహోన్నత దేశాలు: ట్రంప్‌నకు ఇరాన్ కౌంటర్
ABN , Publish Date - Apr 23 , 2026 | 06:26 PM
భారత్, చైనాలను నరకాలతో పోలుస్తూ అమెరికన్ రేడియో వ్యాఖ్యాత మైఖేల్ సావేజ్ షేర్ చేసిన లేఖను రీ-పోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్‌నకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. భారత్, చైనాలు నరకాలు కావని, మానవాళికి మహోన్నత దేశాలని పేర్కొంది.
భారత్, చైనాలను నరకాలతో పోలుస్తూ అమెరికన్ రేడియో వ్యాఖ్యాత మైఖేల్ సావేజ్ షేర్ చేసిన లేఖను రీ-పోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్‌నకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. భారత్, చైనాలు నరకాలు కావని, మానవాళికి మహోన్నత దేశాలని పేర్కొంది. నాగరికతకు భారత్ పుట్టినిల్లు అంటూ హైదరాబాద్‌లోని ఇరాన్ ఎంబసీ ఓ పోస్ట్ చేసింది (Trump hellhole remark).
'భారత్, చైనాకు చెందిన కొందరు మహిళలు తొమ్మిదో నెలలో అమెరికాకు వచ్చి ఇక్కడ పిల్లల్ని కంటున్నారు. ప్రస్తుత చట్టం కారణంగా ఆ శిశువులు అప్పటికప్పుడు అమెరికా పౌరులు అయిపోతున్నారు. ఆ తరువాత వారు చైనా, భారత్, ఇతర నరకప్రాయ దేశాల నుంచి తమ కుటుంబాల్ని తీసుకొస్తున్నారు. భారతీయులు, చైనా వారు లాప్‌టాప్ పట్టుకున్న గ్యాంగ్‌స్టర్లు' అని మైఖేల్ షేర్ చేసిన ఓ లేఖను ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో రీ-పోస్ట్ చేశారు (Iran reaction Trump comment).
ట్రంప్ పోస్ట్‌కు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది (US Iran tensions). 'భారత్, చైనాలు మహోన్నత నాగరికతకు పుట్టినిళ్లు. ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికతలకు నిలయాలు. ఒక దేశ నాగరికతను నాశనం చేస్తామని బెదిరించే నాయకత్వం ఉన్న చోటే నిజమైన నరకం' అని ఇరాన్ పేర్కొంది. ఇరాన్ నాగరికతను అమెరికా నాశనం చేస్తుందని కొద్ది రోజుల క్రితం ట్రంప్ బెదిరించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్
నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి