Share News

చిన్న నౌకలనూ కాల్చేయండి.. అమెరికా నేవీకి ట్రంప్ కీలక సూచనలు

ABN , Publish Date - Apr 23 , 2026 | 08:28 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. హోర్ముజ్ జలసంధిలో మందుపాతరలను అమరస్తున్న ఇరాన్ నౌకలపై దాడులు చేయాలని ఆదేశించారు. ఆ పడవలు ఎంత చిన్నవైనా సరే, వాటిని కాల్చేసి, వాటిల్లోని సిబ్బందిని మట్టుబెట్టాలని అమెరికా నౌకా దళానికి సూచించారు.

చిన్న నౌకలనూ కాల్చేయండి.. అమెరికా నేవీకి ట్రంప్ కీలక సూచనలు
Trump Iran boats shoot order

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. హోర్ముజ్ జలసంధిలో మందుపాతరలను అమరుస్తున్న ఇరాన్ నౌకలపై దాడులు చేయాలని ఆదేశించారు. ఆ పడవలు ఎంత చిన్నవైనా సరే, వాటిని కాల్చేసి, వాటిల్లోని సిబ్బందిని మట్టుబెట్టాలని అమెరికా నౌకా దళానికి సూచించారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా 'ట్రూత్' ద్వారా వెల్లడించారు (Trump Iran boats shoot order).


'అమెరికా మైన్ స్వీపర్లు ప్రస్తుతం హోర్ముజ్ జలసంధిని క్లియర్ చేస్తున్నాయి. ఈ ప్రక్రియను మూడు రెట్ల అధిక వేగంతో కొనసాగించాలని ఆదేశించా. హోర్ముజ్ జలసంధిలో మందుపాతరలను అమరుస్తున్న ఏ చిన్న పడవనైనా సరే కాల్చి ధ్వంసం చేయాలని నేవీని ఆదేశించా. ఈ విషయంలో ఏమాత్రం సంకోచించవద్దని చెప్పాను' అని ట్రంప్ పోస్ట్ చేశారు (Strait of Hormuz crisis 2026).


ట్రంప్ తాజా ఆదేశాలు అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులను మరింత తీవ్రతరం చేశాయి (US Iran tensions). ఇరాన్ చిన్న స్పీడ్‌బోట్లు, డ్రోన్ల ద్వారా నౌకా రవాణాను అడ్డుకుంటోందని అమెరికా ఆరోపిస్తోంది. వాటికి చెక్ పెట్టేందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, అమెరికా నేవీ అనుమతి లేకుండా హోర్ముజ్‌లోకి ఏ నౌక అయినా ప్రవేశించడం గాని, బయటకు వెళ్లడం గానీ జరగదని ట్రంప్ అన్నారు. హోర్ముజ్‌పై అమెరికా పూర్తి నియంత్రణ సాధించినట్టు చెప్పారు.


ఇవి కూడా చదవండి..

శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్


నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి

Updated Date - Apr 23 , 2026 | 08:32 PM