ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ ఇరాన్‌ను మరోసారి హెచ్చరించారు. ఇరాన్ కోసం మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఎదురు చూస్తున్నాయని అన్నారు. అక్కడి నిరంకుశ పాలన అంతమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు కూడా ఇజ్రాయెల్ వాయుసేన జరిపిన తొలి దాడుల్లో గాయపడినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 26వ తేదీన ఇరాన్‌పై ఆపరేషన్ లయన్స్ రోర్ పేరుతో ఇజ్రాయెల్ వాయుసేన దాడులకు దిగిన సంగతి తెలిసిందే.
ఇరాన్ తన శత్రుదేశం అమెరికాకు ఊహించని షాక్ ఇచ్చింది. జోర్డాన్‌లోని అత్యంత ఖరీదైన రాడార్ సిస్టమ్‌ను ధ్వంసం చేసింది. యుద్ధం మొదలైన తొలి రోజుల్లోనే ఇరాన్ దాడుల్లో ఏఎన్ టీపీవై 2 రాడార్ అండ్ సపోర్ట్ ఎక్యుప్‌మెంట్ ధ్వంసం అయింది.
మధ్య ప్రాచ్యంలో యుద్ధం మరో రెండు, మూడు వారాల పాటు ఇలాగే కొనసాగితే ముడి చమురు బ్యారెల్ ధర 150 డాలర్లకు ఎగబాకుతుందని ఖతర్ ఇంధన శాఖ మంత్రి తాజాగా హెచ్చరించారు.
కువైట్ సమీప సముద్రంలో ఆయిల్ ట్యాంకర్‌లో భారీ పేలుడు సంభవించింది. ముబారక్ అల్-కబీర్ పోర్టుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు యూకే మెరైన్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అధికారులు వెల్లడించారు.
ఇరాన్ భూ భాగంపై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు పాకిస్థాన్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్‌తో పాకిస్థాన్ 900 కి.మీ.లకు పైగా సరిహద్దును పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో పొరుగు దేశంపై దాడులను పాకిస్థాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా తీవ్రంగా ఖండించారు.
ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులతో హడలెత్తిస్తున్న వేళ ఇరాన్‌ను భూకంపం కూడా వణికిస్తోంది. ఇరాన్‌లోని గెరాష్ ప్రాంతంలో కాసేపటి క్రితం 4.3 తీవ్రతతో భూకంపం సంభంచింది.
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ప్రపంచ వాణిజ్యంపై, అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించడం ఆసియా దేశాలను వణికిస్తోంది.
ఇరాన్ దాడుల నేపథ్యంలో ప్రజల్లో భయాన్ని పోగొట్టడానికి యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యన్ ఓ గొప్ప పని చేశారు. సోమవారం సాయంత్రం దుబాయ్‌లోని షాపింగ్ మాల్‌కు వెళ్లారు.
అంతర్జాతీయ ముడి చమురు రవాణాకు కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిని మూసేస్తున్నామని, ఏ నౌక అయినా దాటడానికి ప్రయత్నిస్తే కాల్చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, నౌకదళం ఆ పని చేస్తాయని వార్నింగ్ ఇచ్చింది.