Share News

నతాంజ్ అణు కేంద్రంపై దాడులు.. ఇరాన్ ఆగ్రహం..

ABN , Publish Date - Mar 21 , 2026 | 05:00 PM

దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. తాజాగా ఇరాన్‌లోని నతాంజ్ అణు శుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు పాల్పడినట్టు స్థానిక మీడియా సంస్థ తస్నిమ్ తెలిపింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత నతాంజ్ అణు క్షేత్రంపై దాడులు చేయడం ఇది రెండోసారి.

నతాంజ్ అణు కేంద్రంపై దాడులు.. ఇరాన్ ఆగ్రహం..
Natanz nuclear site

దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. తాజాగా ఇరాన్‌లోని నతాంజ్ అణు శుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు పాల్పడినట్టు స్థానిక మీడియా సంస్థ తస్నిమ్ తెలిపింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత నతాంజ్ అణు క్షేత్రంపై దాడులు చేయడం ఇది రెండోసారి. నతాంజ్ అణు క్షేత్రంపై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడ్డాయని, అయితే రేడియోధార్మిక పదార్థాల లీకేజీ జరగలేదని, పరిసర ప్రాంతాల ప్రజలకు ఎలాంటి సమస్యా లేదని తెలిపింది (Natanz nuclear site).


నతాంజ్ క్షేత్రంపై ఇజ్రాయెల్, అమెరికా దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికా, ఇజ్రాయెల్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం, ఇతర అణు భద్రత నిబంధనలు, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయని పేర్కొంది. నేరపూరిత చర్యల్లో భాగంగానే నతాంజ్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేశాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. యుద్ధం ప్రారంభమైన మొదటి వారంలోనే నతాంజ్ అణు కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు దిగిన సంగతి తెలిసిందే (Iran nuclear facility attack).


తాము జరిపిన దాడుల్లో ఇరాన్‌కు భారీ నష్టం వాటిల్లిందని, ఇక ఆ దేశానికి యురేనియం శుద్ధి, బాలిస్టిక్ క్షిపణుల తయారీ సామర్థ్యం లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రకటించారు (US Israel airstrike Iran). నెతన్యాహు ప్రకటించిన కొద్ది గంటల్లోనే నతాంజ్ అణు కేంద్రంపై దాడులు జరగడం గమనార్హం. నతాంజ్ అణు కేంద్రం టెహ్రాన్‌కు దాదాపు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది.


ఇవి కూడా చదవండి..

వారం రోజుల్లో ఆరు బ్యాంక్‌ల్లో చోరీ.. ఎంత దోచుకున్నాడో తెలిస్తే..


మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. ఈ పూల మధ్యలో గంట ఎక్కడుందో 10 సెకెన్లలో కనుక్కోండి..

Updated Date - Mar 21 , 2026 | 05:00 PM