వారం రోజుల్లో ఆరు బ్యాంక్‌ల్లో చోరీ.. ఎంత దోచుకున్నాడో తెలిస్తే..
ABN , Publish Date - Mar 21 , 2026 | 03:37 PM
ఆ వ్యక్తి ఒకే బ్యాంక్‌కు చెందిన ఆరు బ్రాంచ్‌లలో దొంగతనానికి పాల్పడ్డాడు. వారం రోజుల వ్యవధిలోనే ఆ చోరీలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేశాడు. కొన్ని డాలర్లను తస్కరించాడు. అయితే అతడు ఎంత దోచుకున్నాడో తెలిస్తే మాత్రం నవ్వు రాక తప్పదు.
ఆ వ్యక్తి ఒకే బ్యాంక్‌కు చెందిన ఆరు బ్రాంచ్‌లలో దొంగతనానికి పాల్పడ్డాడు. వారం రోజుల వ్యవధిలోనే ఆ చోరీలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేశాడు. కొన్ని డాలర్లను తస్కరించాడు. అయితే అతడు ఎంత దోచుకున్నాడో తెలిస్తే మాత్రం నవ్వు రాక తప్పదు. ఎందుకంటే అతడు ఆరు బ్యాంక్‌లను దోచుకుని కేవలం 605 డాలర్లు మాత్రమే పోగేశాడు. అంటే భారత కరెన్సీలో కేవలం రూ.56 వేలు (Failed bank robbery).
న్యూయార్క్‌లోని ఛేజ్ బ్యాంక్‌లో గుస్తావో డిజీసన్ టొర్రెస్ ఇటీవల దోపిడీకి పాల్పడ్డాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే, బ్యాంకులోని కస్టమరన్లు గాయపరుస్తానని రాసి ఉన్న స్లిప్‌ను క్యాషియర్‌కు ఇచ్చాడు. భయపడిన క్యాషియర్ అతడికి కొంత డబ్బు ఇచ్చాడు. అలా న్యూయార్క్ నగరంలోని ఛేజ్ బ్యాంక్‌కు చెందిన పలు బ్రాంచ్‌లకు వెళ్లిన టొర్రెస్ ఇదే తరహాలో బెదిరించాడు. రెండు బ్యాంక్‌ల్లో అతడికి డబ్బులేం ఇవ్వలేదు. ఒక బ్యాంక్‌లో కేవలం 20 డాలర్ల నోటు మాత్రమే లభించింది (56000 rupees robbery).
మొత్తానికి అతడు ఆరు ఛేజ్ బ్యాంక్ బ్రాంచ్‌లపై దోపిడికీ పాల్పడి రూ.56 వేల సంపాదించాడన్నమాట (unusual crime story). బ్యాంకర్ల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కాగా, గతేడాది మాన్‌హటన్‌లోని ఓ బ్యాంక్‌లో కూడా ఇదే తరహాలో చోరీ చేసి టొర్రెస్ అరెస్ట్ అయ్యాడు. అప్పుడు కూడా టొర్రెస్ 600 డాలర్లు మాత్రమే కాజేయడం గామనార్హం.
ఈ వార్తలూ చదవండి:
చమురు, గ్యాస్‌కు..మరో 6 నెలలు కష్టాలే!
ఇరాన్‌పై దాడులకు స్వస్తి చెప్పే యోచనలో ట్రంప్