హోర్ముజ్‌ను తెరవండి.. ఇరాన్‌కు పలు దేశాల విజ్ఞప్తి..
ABN , Publish Date - Mar 21 , 2026 | 08:23 PM
హోర్ముజ్ జలసంధిని తెరవాలని ఇరాన్‌కు 22 దేశాలు విజ్ఞప్తి చేశాయి. అలాగే పొరుగు దేశాలపై దాడులను కూడా ఆపాలని కోరాయి. చమురు క్షేత్రాలు, వాణిజ్య నౌకలపై దాడులను ఖండించాయి.
హోర్ముజ్ జలసంధిని తెరవాలని ఇరాన్‌కు 22 దేశాలు విజ్ఞప్తి చేశాయి. అలాగే పొరుగు దేశాలపై దాడులను కూడా ఆపాలని కోరాయి. చమురు క్షేత్రాలు, వాణిజ్య నౌకలపై దాడులను ఖండించాయి. ఇరాన్ దాడులతో అన్ని దేశాల ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోందని, గల్ఫ్ దేశాలపై దాడులను ఆపాలని కోరాయి (Iran global pressure).
ఇరాన్‌కు సూచనలు చేస్తూ యూఏఈ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్, న్యూజిలాండ్, డెన్మార్క్, కెనడా, బహ్రెయిన్ తదితర దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి. గల్ఫ్‌లోని నిరాయుధ నౌకలు, చమురు, గ్యాస్ కేంద్రాలు సహా మౌలిక సదుపాయాలపై ఇరాన్ జరిపిన దాడులను ఖండిస్తున్నట్టు ప్రకటించాయి. ఇరాన్ చర్యలు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలపై, అత్యంత బలహీనవర్గాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొన్నాయి (Iran shipping route).
'చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేయడాన్ని ఖండిస్తున్నాం (Hormuz Strait news). సముద్ర చట్టాలకు సంబంధించి ఐరాస ఒప్పందంతో పాటు స్వేచ్ఛాయుత నౌకాయానం అనేది అంతర్జాతీయ చట్టంలో ఓ ప్రాథమిక సూత్రం. ఇరాన్ చర్యలతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు' అని యూఏఈ విదేశాంగ శాఖ ఓ సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ఇందులో 22 దేశాలు సంతకాలు చేశాయి.
ఇవి కూడా చదవండి..
వారం రోజుల్లో ఆరు బ్యాంక్‌ల్లో చోరీ.. ఎంత దోచుకున్నాడో తెలిస్తే..
మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. ఈ పూల మధ్యలో గంట ఎక్కడుందో 10 సెకెన్లలో కనుక్కోండి..