ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ క్షిపణి దాడులు.. 150 మందికి పైగా గాయాలు..
ABN , Publish Date - Mar 22 , 2026 | 03:58 PM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ నగరాలపై తాజాగా ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్‌లోని డిమోనా, అరాద్ నగరాలపై ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడింది. డిమోనా నగరంలోని ఇజ్రాయెల్‌కు అత్యంత కీలకమైన అణు పరిశోధనా కేంద్రం ఉంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ నగరాలపై తాజాగా ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్‌లోని డిమోనా, అరాద్ నగరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. డిమోనా నగరంలోని ఇజ్రాయెల్‌కు అత్యంత కీలకమైన అణు పరిశోధనా కేంద్రం ఉంది. ఈ అణు పరిశోధనా కేంద్రానికి సమీపంలోని భవనాలపై ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు పడ్డాయి (Iran missile attack Israel).
ఇరాన్ దాడులతో ఈ అణు పరిశోధనా కేంద్రానికి నష్టం వాటిల్లలేదు. అయితే పౌర నివాసాలపై క్షిపణులు పడడం వల్ల దాదాపు వంద మంది గాయపడినట్టు సమాచారం. డిమోనా అణు పరిశోధనా కేంద్రం నుంచి ఎలాంటి రేడియేషన్ లీకేజీ లేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకటించింది. మరోవైపు అరాద్ నగరంపై జరిగిన దాడిలో 88 మంది గాయపడినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. శనివారం నతాంజ్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగానే ఈ ఎటాక్స్ చేశామని ఇరాన్ ప్రకటించింది (Dimona Arad strike).
ఇరాన్ నుంచి వచ్చిన బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు విఫలమైనట్టు వార్తలు వస్తున్నాయి (Israel Iran conflict 2026). దీంతో డిమోనా, అరాద్ నగరాలపై క్షిపణులు పడ్డాయి. పెద్ద ఎత్తున మంటలు చేలరేగి, భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో పలువురు మరణించి ఉండొచ్చని, భవనాల కింద చిక్కుకుపోయి ఉంటారని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. అయితే మరణాలను ఇజ్రాయెల్ అధికారులు ధ్రువీకరించలేదు. ఈ దాడులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హామీల అమలుకే నిధులు లేవు.. మూసీ ప్రక్షాళనకు డబ్బులు ఎక్కడివి?: టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
ఆర్టీసీలో సూపర్‌వైజర్ ఉద్యోగాలకు హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..