Share News

ఇరాన్ యుద్ధం.. భారత్ జోక్యం చేసుకుంటే పరిస్థితులు సద్దుమణుగుతాయి: ఫిన్లాండ్ అధ్యక్షుడు

ABN , Publish Date - Mar 17 , 2026 | 03:23 PM

అమెరికా, ఇరాన్‌ల మధ్య తీవ్రమవుతున్న యుద్ధానికి భారతదేశమే ఏకైక విశ్వసనీయ పరిష్కార మార్గమని, ఉద్రిక్తతలను తగ్గించడంలో న్యూఢిల్లీ దౌత్యపరమైన పాత్ర పోషించాలని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ పేర్కొన్నారు.

ఇరాన్ యుద్ధం.. భారత్ జోక్యం చేసుకుంటే పరిస్థితులు సద్దుమణుగుతాయి: ఫిన్లాండ్ అధ్యక్షుడు
Alexander Stubb India peace call

అమెరికా, ఇరాన్‌ల మధ్య తీవ్రమవుతున్న యుద్ధానికి భారతదేశమే ఏకైక విశ్వసనీయ పరిష్కార మార్గమని, ఉద్రిక్తతలను తగ్గించడంలో న్యూఢిల్లీ దౌత్యపరమైన పాత్ర పోషించాలని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ పేర్కొన్నారు. భారతదేశంలో తన అధికారిక పర్యటన (మార్చి 4 నుంచి 7) ముగించుకుని తిరిగి వెళ్లిన అలెగ్జాండర్ స్టబ్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. మధ్యప్రాచ్యంలో 18 రోజుల సంఘర్షణ ప్రపంచ విపత్తుగా మారకుండా నిరోధించడం కోసం భారత్ తన ప్రత్యేక స్థానాన్ని ఉపయోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు (Finland President India role).


అమెరికా, ఇరాన్ మధ్య శాంతి మధ్యవర్తిత్వం చేయడంలో భారతదేశం సహాయపడగలదని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ అభిప్రాయపడ్డారు. 'మనందరికీ కాల్పుల విరమణ అవసరం. భారత్ నిజంగా ఇందులో జోక్యం చేసుకోగలదా అని నేను ఆలోచిస్తున్నాను. పరిస్థితులను చక్కదిద్దడానికి విదేశాంగ మంత్రి జైశంకర్ కాల్పుల విరమణకు పిలుపునివ్వడం మనం చూశాం' అని స్టబ్ అన్నారు. భారత్‌కు అటు అమెరికా, ఇజ్రాయెల్‌తోనూ, మరోవైపు ఇరాన్‌తోనూ స్నేహ సంబంధాలున్నాయని గుర్తు చేశారు. ఇరు పక్షాలు న్యూఢిల్లీ పట్ల నమ్మకంగా ఉంటాయని అన్నారు (India mediation Iran US).


కాగా, ఈ సమస్య నుంచి ప్రపంచాన్ని భారత్ మాత్రమే కాపాడగలదని అమెరికాకు చెందిన అనుభవజ్ఞుడైన వ్యూహకర్త, విశ్రాంత యూఎస్ ఆర్మీ కల్నల్ డగ్లస్ మాక్‌గ్రెగర్ కూడా అభిప్రాయపడ్డారు (India diplomacy global role). ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడటానికి భారతదేశం వైపు చూడాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు బహిరంగంగా సలహా ఇచ్చారు. అమెరికా క్షిపణి నిల్వలు తరిగిపోతున్నాయని, మరోవైపు చమురు సంక్షోభం పెరుగుతోందని, వీటిని నివారించడానికి దౌత్యపరమైన నిష్క్రమణే ఏకైక మార్గమని మాక్‌గ్రెగర్ హెచ్చరించారు. 'యుద్ధం ఆగాలంటే.. అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీకి ఫోన్ చేయాలి' అని సూచించారు.


ఇవి కూడా చదవండి..

సెలవు ఇవ్వలేదని.. బ్యాంక్ మేనేజర్‌ను కాల్చేసిన గార్డ్..


మీ కళ్లకు పరీక్ష.. ఈ గడ్డిలో పాము ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 17 , 2026 | 03:45 PM