సెలవు ఇవ్వలేదని.. బ్యాంక్ మేనేజర్‌ను కాల్చేసిన గార్డ్..
ABN , Publish Date - Mar 17 , 2026 | 02:52 PM
ఘజియాబాద్‌లో ఓ సెక్యూరిటీ గార్డు ఘాతుకానికి పాల్పడ్డాడు. సెలవులు, జీతం విషయంలో విభేదాలు రావడంతో అందరూ చూస్తుండగా బ్యాంక్ మేనేజర్‌ను కాల్చి చంపాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఘజియాబాద్‌లో ఓ సెక్యూరిటీ గార్డు ఘాతుకానికి పాల్పడ్డాడు. సెలవులు, జీతం విషయంలో విభేదాలు రావడంతో అందరూ చూస్తుండగా బ్యాంక్ మేనేజర్‌ను కాల్చి చంపాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఘజియాబాద్‌లోని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో రవీంద్ర హుడా అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతడికి సెలవుల గురించి తరచుగా బ్యాంక్ మేనేజర్ అభిషేక్ కుమార్ (34)తో విభేదాలు తలెత్తుతుండేవి (Bank guard shooting).
ఎప్పుడు అడిగినా మేనేజర్ సెలవు తిరస్కరిస్తుండడంతో అతడిపై రవీంద్ర తీవ్రంగా కోపం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి అభిషేక్ క్యాబిన్‌లోకి వెళ్లిన రవీంద్ర, తుపాకీతో అతడిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన అభిషేక్‌ను ఇతర సిబ్బంది హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు వెంటనే రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. మేనేజర్ హత్యలో రవీంద్రకు సహకరించిన శిశుపాల్‌ను కూడా అరెస్ట్ చేశారు (Manager shot dead).
తాను ఎప్పుడు లీవ్ అడిగినా మేనేజర్ నిరాకరించేవాడని, బ్యాంక్‌కు రాని రోజును సెలవుగా పరిగణించకుండా జీతం కట్ చేసేవాడని, ఆ కోపంతోనే అతడిని కాల్చి చంపానని పోలీసుల విచారణలో రవీంద్ర తెలిపాడు (Leave issue violence). సెలవుల విషయంలో మేనేజర్‌తో తరచుగా తనకు గొడవలు జరుగుతుండేవని చెప్పాడు. తాను కాల్పులు జరిపిన సమయంలో స్నేహితుడు శిశుపాల్ పక్కనే ఉన్నట్టు కూడా పోలీసుల విచారణలో రవీంద్ర చెప్పాడు. ఆర్మీలో పని చేసి 2018లో రిటైర్ అయిన రవీంద్ర బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా జాయిన్ అయ్యాడు.
ఈ వార్తలూ చదవండి:
పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి..
బెంగాల్ సీఎస్, డీజీపీపై వేటు