Share News

పాకిస్థాన్‌ వైమానిక దాడి.. 400 మంది మృతి..

ABN , Publish Date - Mar 17 , 2026 | 07:08 AM

అఫ్గానిస్థాన్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో 400 మంది ప్రాణాలు కోల్పోగా.. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కాబుల్‌లోని ఓ ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి చేసిందని..

పాకిస్థాన్‌ వైమానిక దాడి.. 400 మంది మృతి..

అఫ్గానిస్థాన్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో 400 మంది ప్రాణాలు కోల్పోగా.. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కాబుల్‌లోని ఓ ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి చేసిందని.. ఈ దాడిలో 400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాలిబన్లు ప్రకటించారు. ఈ దాడిలో ఆస్పత్రి పూర్తిగా ధ్వంసమైందని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తాలిబన్ ప్రభుత్వం తెలిపింది.


ఇదిలాఉంటే.. అఫ్గాన్ ప్రభుత్వ ఆరోపణలు పాకిస్థాన్ కొట్టిపడేసింది. కాబూల్‌లోని ఏ ఆస్పత్రిని కూడా తాము టార్గెట్ చేసుకోలేదని పేర్కొంది. అఫ్గానిస్థాన్‌ చెప్పేదాంట్లో నిజాలు లేవంది.

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ దేశాల మధ్య ఘర్షణలు మూడో వారానికి చేరుకున్నాయి. ఇరు పక్షాలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని.. పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో నలుగురు అఫ్గాన్‌ సైనికులు చనిపోయినట్లు ఆ దేశాధికారులు చెప్పారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే కాబుల్‌లోని ఆస్పత్రిపై వైమానిక దాడికి పాల్పడినట్లు అఫ్గాన్‌ ఆరోపించింది.

‘కాబుల్‌లోని డి అడిక్షన్ సెంటర్‌పై పాక్ వైమానిక దళం దాడి చేసింది. ఈ దాడిలో భారీ ప్రాణ నష్టం జరిగింది. చాలా మంది గాయపడ్డారు. పాకిస్థాన్ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి తగిన గుణపాఠం చెబుతాం’ అని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ తెలిపారు.


Also Read:

ఓరల్‌ సెక్స్‌తో గొంతు క్యాన్సర్‌!

‘నిద్ర పో బిడ్డా..’

బెంగాల్‌ సీఎస్‌, డీజీపీపై వేటు

Updated Date - Mar 17 , 2026 | 07:43 AM