ఖతార్ గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ దాడి.. భారత్ కష్టాలు మరింత పెరుగుతాయా?
ABN , Publish Date - Mar 19 , 2026 | 03:32 PM
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పటికే భారత్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా గ్యాస్ సరఫరా కొరత భయాందోళనలు కలిగిస్తోంది. ఇలాంటి తరుణంలో ఖతార్‌లోని కీలక గ్యాస్ కేంద్రం రాస్ లఫాన్‌పై ఇరాన్ క్షిపణి దాడి ప్రపంచ ఇంధన రంగాన్ని కలవరపెడుతోంది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పటికే భారత్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా గ్యాస్ సరఫరా కొరత భయాందోళనలు కలిగిస్తోంది. ఇలాంటి తరుణంలో ఖతార్‌లోని కీలక గ్యాస్ కేంద్రం రాస్ లఫాన్‌పై ఇరాన్ క్షిపణి దాడి ప్రపంచ ఇంధన రంగాన్ని కలవరపెడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్పీజీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ఎగుమతి కేంద్రమైన ఈ ప్రాంతం దెబ్బతినడం వల్ల, ఇప్పటికే ఎల్పీజీ కొరతను ఎదుర్కొంటున్న భారత్‌పై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది (Iran Qatar attack impact on India).
భారత్ ఎల్పీజీ దిగుమతుల్లో 40 నుంచి 47 శాతం వరకు ఖతార్ నుంచే జరుగుతున్నాయి. రాస్ లఫాన్ కేంద్రం ఈ దిగుమతులకు ప్రధాన కేంద్రంగా ఉంది. భారత్-ఖతార్ మధ్య 2024లో 78 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం 2028 నుంచి 20 ఏళ్ల పాటు ఏడాదికి 7.5 మిలియన్ టన్నుల ఎల్పీజీని భారత్‌కు ఖతార్ సరఫరా చేయాల్సి ఉంటుంది. తాజాగా ఇరాన్ దాడిలో రాస్ లఫాన్ తీవ్రంగా దెబ్బతిన్నట్టు వార్తలు రావడం భారత ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది (Ras Laffan LNG strike).
ఖతార్ నుంచి దిగుమతయ్యే ఎల్పీజీని భారత్‌లో గృహావసరాలు, విద్యుత్తు ఉత్పత్తి, ఎరువుల ఉత్పత్తి, పరిశ్రమల వినియోగం కోసం ఎక్కువగా వాడుతుంటారు. అమెరికా, ఆఫ్రికా దేశాలతో పోల్చుకుంటే ఖతార్ నుంచి వచ్చే ఎల్పీజీ చాలా చవకగా భారత్‌కు చేరుకుంటుంది. ఇప్పటికే హోర్ముజ్ జలసంధిని మూసేయడంతో ఇంధన కష్టాలు మొదలయ్యాయి (LPG crisis India 2026).
రాస్ లఫాన్‌పై జరిగిన తాజా దాడి.. దేశంలో ఎల్పీజీ కొరత, ధరల పెరుగుదల, పరిశ్రమలపై ప్రభావం వంటి పలు సమస్యలను మరింత తీవ్రమయ్యేలా చేస్తుందనడంలో సందేహం లేదు (Gas price rise India). ఎల్పీజీ సబ్సిడీ భారం ప్రభుత్వంపై మరింతగా పెరిగే అవకాశముంది. ఈ పరిణామాలు వచ్చే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.
ఇవి కూడా చదవండి..
భారత నౌకలను ఇరాన్ అడ్డుకుంటోందా.. కేంద్రం స్పందన ఏంటంటే..
మీ కళ్లు షార్ప్ అయితేనే.. ఈ ఫొటోలో పక్షిని 15 సెకెన్లలో కనిపెట్టగలరు..