ఖతార్, సౌదీ, యూఏఈ చమురు క్షేత్రాలపై దాడులు చేస్తాం.. ఇరాన్ వార్నింగ్
ABN , Publish Date - Mar 18 , 2026 | 07:47 PM
ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలపై మరికొన్ని గంటల్లో ఇరాన్ దాడి చేయబోతోందని ఆ దేశ ప్రభుత్వ టెలివిజన్ కాసేపటి క్రితం ఒక కథనాన్ని ప్రసారం చేసింది.
ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలపై మరికొన్ని గంటల్లో ఇరాన్ దాడి చేయబోతోందని ఆ దేశ ప్రభుత్వ టెలివిజన్ కాసేపటి క్రితం ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన టెహ్రాన్ టైమ్స్ కథనం ప్రకారం.. సౌదీ అరేబియాలోని సామ్రెఫ్ రిఫైనరీ, జుబైల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, యూఏఈలోని అల్ హసన్ గ్యాస్ ఫీల్డ్, ఖతార్‌లోని పెట్రోకెమికల్ ప్లాంట్లపై ఇరాన్ దాడులు చేయబోతోంది (Iran threat Gulf energy).
బుధవారం ఉదయం తమ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్, దాని అనుబంధ మౌలిక సదుపాయాలపై దాడి జరిగిందని ఇరాన్ వెల్లడించింది. ఘటనా స్థలంలో, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. ప్రపంచంలోని అతిపెద్ద సహజ వాయువు అభివృద్ధి కేంద్రాలలో ఒకటి, ప్రపంచ ఎల్‌ఎన్‌జీ సరఫరాకు కీలకమైన సౌత్ పార్స్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేసిన నేపథ్యంలో ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. ఇరాన్ హెచ్చరికలతో చమురు సరఫరాలో అంతరాయాలు, ప్రపంచ ఇంధన మార్కెట్ అస్థిరతపై ఆందోళనలు మరింత తీవ్రమవుతున్నాయి (Saudi oil facilities threat).
ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో సుమారు ఐదో వంతు రవాణా జరిగే హోర్ముజ్ జలసంధి మూసివేయడం చాలా దేశాలకు తీరని నష్టం కలిగిస్తోంది (Middle East crisis 2026). ఎగుమతులు నిలిచిపోవడంతో గల్ఫ్‌లోని పలు దేశాలు చమురు ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో చమురు, గ్యాస్ సరఫరా భారీగా తగ్గిపోయింది. ఇప్పటికే ముడి చమురు బ్రెంట్ ధర బ్యారెల్‌కు 108 డాలర్ల పైకి చేరింది. ఇరాన్ తాజా హెచ్చరికల నేపథ్యంలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారనుంది.
ఇవి కూడా చదవండి..
అక్రమవలసదారులకు అమెరికా ఆఫర్.. దేశం నుంచి వెళ్లిపోతే రూ.2.4 లక్షలు..
మీది డేగ చూపు అయితే.. ఈ అడవిలో చిరుతను 5 సెకెన్లలో కనిపెట్టండి..