Share News

వచ్చే వారం మరింత తీవ్ర దాడులు.. ఇజ్రాయెల్ మంత్రి వార్నింగ్..

ABN , Publish Date - Mar 21 , 2026 | 07:59 PM

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లబడే సూచనలు కనిపించడం లేదు. దాడులు, ప్రతిదాడులతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇలాంటి తరుణంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

వచ్చే వారం మరింత తీవ్ర దాడులు.. ఇజ్రాయెల్ మంత్రి వార్నింగ్..
Israel Iran war

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లబడే సూచనలు కనిపించడం లేదు. దాడులు, ప్రతిదాడులతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇలాంటి తరుణంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే వారంలో ఇరాన్‌పై దాడుల తీవ్రత మరింత పెరుగుతుందని వెల్లడించారు. ఇరాన్‌పై సైనిక చర్యను క్రమంగా తగ్గించే యోచనలో ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే కట్ట్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది (Israel Iran war).


'వచ్చే వారం ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రంగా ఉండబోతున్నాయి. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ భద్రతకు, అమెరికా ప్రయోజనాలకు పొంచి ఉన్న ముప్పు పూర్తిగా తొలగిపోయే వరకు, ఆ దేశ పాలకులను, కమాండర్లను, వ్యూహాత్మక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుంటాం. యుద్ధ లక్ష్యాలను పూర్తిగా సాధించే వరకు విశ్రమించేది లేదు' అని సైనిక అధికారులతో ఇజ్రాయెల్ కట్జ్ వ్యాఖ్యానించినట్టు స్థానిక మీడియా పేర్కొంది (Israel Katz statement).


ఇరాన్ నుంచి అణు ముప్పును తొలగించడం, దాని సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడం, ఆ దేశ ప్రజలకు స్వేచ్ఛ కల్పించడమే తమ లక్ష్యాలని అంతకు ముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు పేర్కొన్నారు (US Israel strikes Iran). ఇజ్రాయెల్ నేతల వ్యాఖ్యలతో ఈ యుద్ధం ముగింపుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ యుద్ధం సాధ్యమైనంత త్వరగా ముగిసిపోవాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి.


ఇవి కూడా చదవండి..

వారం రోజుల్లో ఆరు బ్యాంక్‌ల్లో చోరీ.. ఎంత దోచుకున్నాడో తెలిస్తే..


మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. ఈ పూల మధ్యలో గంట ఎక్కడుందో 10 సెకెన్లలో కనుక్కోండి..

Updated Date - Mar 21 , 2026 | 07:59 PM