Share News

హోర్ముజ్ మీదుగా వెళ్లాలంటే టోల్ ఛార్జ్.. ఇరాన్ సరికొత్త ప్లాన్ వేస్తోందా..

ABN , Publish Date - Mar 19 , 2026 | 08:42 PM

ప్రపంచ ముడి చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఉపయోగించుకుని ఆర్థికంగా లాభపడేందుకు ఇరాన్ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడి నేపథ్యంలో ఈ జలసంధిని ఇరాన్ ఇప్పటికే బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే.

హోర్ముజ్ మీదుగా వెళ్లాలంటే టోల్ ఛార్జ్.. ఇరాన్ సరికొత్త ప్లాన్ వేస్తోందా..
Iran Hormuz transit fees

ప్రపంచ ముడి చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఉపయోగించుకుని ఆర్థికంగా లాభపడేందుకు ఇరాన్ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడి నేపథ్యంలో ఈ జలసంధిని ఇరాన్ ఇప్పటికే బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇరాన్‌ను ఆనుకుని ఉన్న హోర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకలు ఇకపై కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఇరాన్ చట్టసభ సభ్యుడు ఒకరు స్థానిక మీడియాతో పంచుకున్నారు (Iran Hormuz transit fees).


ఇంధన రవాణా, నౌకాయానం, ఆహార సామాగ్రి సరఫరా కోసం హోర్ముజ్‌ను ఉపయోగించుకునే దేశాలు ఇకపై ఇరాన్‌కు టోల్ ఛార్జ్ (Iran shipping charges 2026) కట్టేలా బిల్లును తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టు ఆ చట్టసభ సభ్యుడు తెలిపారు. యుద్ధం ముగిసిన తర్వాత హోర్ముజ్ జలసంధి విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు విధించిన దేశాలపై తాము కూడా అలాంటి చర్యలే తీసుకుంటామని ఇప్పటికే ఇరాన్ ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు.


ఇవి కూడా చదవండి..

భారత నౌకలను ఇరాన్ అడ్డుకుంటోందా.. కేంద్రం స్పందన ఏంటంటే..


మీ కళ్లు షార్ప్ అయితేనే.. ఈ ఫొటోలో పక్షిని 15 సెకెన్లలో కనిపెట్టగలరు..

Updated Date - Mar 19 , 2026 | 08:42 PM