ఇరాన్‌లో భారతీయులకు అక్కడి ఇండియన్ ఎంబసీ కీలక సూచన చేసింది. తమ నివాసాల్లోంచి కాలు బయటపెట్టవద్దని పేర్కొంది. మిలిటరీ స్థావరాలు, విద్యుత్ కేంద్రాలకు దూరంగా ఉండాలని పేర్కొంది.
తాత్కాలిక కాల్పుల విరమణకు బదులు శాశ్వతంగా యుద్ధానికి తెరదించే పరిష్కారం కావాలని అమెరికాకు ఇరాన్ తేల్చి చెప్పింది. కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా ప్రతిపాదనలను తమ ప్రభుత్వం తిరస్కరించిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ సోమవారం ఓ కథనాన్ని ప్రచురించింది.
గ్రీన్ ఆశా అనే మరో సరకు రవాణా నౌక సురక్షితంగా హోర్ముజ్‌ను దాటింది. ఎల్‌పీజీతో ఉన్న ఈ నౌక భారత్ వైపు బయలుదేరినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
శాంతి చర్చల ప్రతిపాదన ముందుకు కదలకపోవడంతో పశ్చిమాసియా భీకర దాడులతో దద్దరిల్లుతోంది. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. త్వరలోనే అమెరికా, ఇజ్రాయెల్‌కు భారీ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది.
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడి చేయడంతో ప్రారంభమైన యుద్ధం ఆరో వారానికి చేరుకుంది. ఈ యుద్ధ ప్రభావం ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్‌తో పాటు గల్ఫ్ దేశాలకు, ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలకు తీవ్ర నష్టం కలిగించింది.
అమెరికాకు చెందిన అమెరికన్ ఏ-10 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసింది. శుక్రవారం స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర అమెరికన్ ఏ-10 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసిందని తస్‌నిమ్ న్యూస్ ఎజెన్సీ తెలిపింది.
శుక్రవారం ఇరాన్ ప్రయోగించిన మిసైల్‌ను అబుధాబీ మార్గమధ్యంలోనే అడ్డుకుంది. అయితే, కొన్ని శకలాలు తగలడంతో అబుధాబిలో 12 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారని ప్రభుత్వ మీడియా కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇరాన్ ప్రతీకార దాడులకు సిద్ధమైంది. గల్ఫ్, జోర్డాన్‌లలోని 8 ప్రముఖ బ్రిడ్జ్‌లను ఐఆర్‌జీసీ టార్గెట్ చేసింది. ఈ మేరకు ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ఐఆర్‌జీసీ దాడులు చేయడానికి నిశ్చయించుకున్న బ్రిడ్జ్‌ల లిస్ట్‌ను రిలీజ్ చేసింది.
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా దెబ్బతిన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి ముందుకు రావాలని ఇరాన్ ప్రజలకు ఆ దేశ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ పిలుపునిచ్చారు.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సహా ఆ దేశ ఉన్నతాధికారులు మంగళవారం 'ఇస్లామిక్ రిపబ్లిక్ డే' వేడుకల్లో భాగంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత బహిరంగంగా కనిపించారు.