Share News

అమెరికా, ఇజ్రాయెల్‌కు పెద్ద సర్‌ప్రైజ్ ఇస్తాం.. ఇరాన్ వార్నింగ్..

ABN , Publish Date - Apr 05 , 2026 | 10:51 AM

శాంతి చర్చల ప్రతిపాదన ముందుకు కదలకపోవడంతో పశ్చిమాసియా భీకర దాడులతో దద్దరిల్లుతోంది. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. త్వరలోనే అమెరికా, ఇజ్రాయెల్‌కు భారీ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది.

అమెరికా, ఇజ్రాయెల్‌కు పెద్ద సర్‌ప్రైజ్ ఇస్తాం.. ఇరాన్ వార్నింగ్..
Iran warning US Israel

శాంతి చర్చల ప్రతిపాదన ముందుకు కదలకపోవడంతో పశ్చిమాసియా భీకర దాడులతో దద్దరిల్లుతోంది. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. త్వరలోనే అమెరికా, ఇజ్రాయెల్‌కు భారీ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ భద్రతాధికారి ఓ ప్రకటన చేశారు. నిర్దిష్ట లక్ష్యాలు, సొంత ప్రణాళికల కోసమే ఇరాన్ యుద్ధం చేస్తోందని ఆయన పేర్కొన్నారు (Iran warning US Israel).


'త్వరలో అమెరికా, ఇజ్రాయెల్‌కు పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాం. అమెరికా లక్ష్యాల జాబితా లోపభూయిష్టంగా ఉంది. మా వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయి. వారి సైనిక చర్యలు విఫలమయ్యాయి. మేం అమెరికా యుద్ధ విమానాలను కూల్చేశాం' అని ఇరాన్ భద్రతాధికారి పేర్కొన్నారు (Iran big surprise statement).


హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లోపు తెరవకుంటే ఇరాన్‌కు నరకం చూపిస్తామని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించిన సంగతి తెలిసిందే (US Iran conflict). ఆ వార్నింగ్‌పై ఇరాన్ జనరల్ అలీ అబ్దుల్లాహి స్పందిస్తూ.. ట్రంప్ హెచ్చరికను తెలివి తక్కువ చర్యగా అభివర్ణించారు. తమ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే తీవ్రంగా స్పందిస్తామన్నారు.


ఇవి కూడా చదవండి..

కోల్‌కతానూ కొట్టగలం.. పాక్ విదేశాంగ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..


శుభ్‌మన్ గిల్‌కు గాయం.. జట్టుతో చేరడానికి ఎంత సమయం పడుతుంది..

Updated Date - Apr 05 , 2026 | 10:51 AM