Share News

ఏడాది కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది: ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు సమీర్ రిజ్వీ..

ABN , Publish Date - Apr 05 , 2026 | 09:23 AM

సూపర్‌ ఫామ్‌లో ఉన్న సమీర్‌ రిజ్వీ (51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90) మరోసారి మ్యాచ్‌ విన్నింగ్‌ హఫ్ సెంచరీతో మెరిశాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఏడాది కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది: ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు సమీర్ రిజ్వీ..
Sameer Rizvi IPL 2026

సూపర్‌ ఫామ్‌లో ఉన్న సమీర్‌ రిజ్వీ (51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90) మరోసారి మ్యాచ్‌ విన్నింగ్‌ హఫ్ సెంచరీతో మెరిశాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. టాపార్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన రిజ్వీ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. గతేడాది తను చేసిన ప్రాక్టీస్ గురించి మాట్లాడాడు (Sameer Rizvi IPL 2026).


'గత ఏడాది చాలా మార్పులు వచ్చాయి. నేను ఎంతో కష్టపడ్డాను. నా బలహీనతలన్నింటిపై దృష్టి పెట్టాను. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనేటపుడు నాకు కొన్ని ఇబ్బందులు ఉండేవి. అందుకే ఏడాది పొడవునా దానిపై చాలా కృషి చేశాను. ఆ కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కుతోంది. నా బ్యాటింగ్, ఆలోచనా విధానం చాలా మెరుగుపడ్డాయి. రెండు మ్యాచ్‌ల్లోనూ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పరిస్థితిని అర్థం చేసుకుని బ్యాటింగ్ చేశాను' అని రిజ్వీ పేర్కొన్నాడు (DC vs MI).


'మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకొని కొన్నిసార్లు సమయం తీసుకోవాల్సి ఉంటుంది (Rizvi performance). మరికొన్ని సార్లు దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. మైదానంలోకి వెళ్లిన తర్వాతే ఎలా ఆడాలనే దానిపై నిర్ణయం తీసుకుంటా. ఐపీఎల్‌లో మంచి ఫామ్ కనబరిస్తే మున్ముందు మాలాంటి కుర్రాళ్లకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి. పెద్ద వేదికలపై ఆడేందుకు ఛాన్స్‌లు లభిస్తాయి' అని రిజ్వీ పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి..

కోల్‌కతానూ కొట్టగలం.. పాక్ విదేశాంగ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..


శుభ్‌మన్ గిల్‌కు గాయం.. జట్టుతో చేరడానికి ఎంత సమయం పడుతుంది..

Updated Date - Apr 05 , 2026 | 09:33 AM