Share News

కోల్‌కతానూ కొట్టగలం.. పాక్ విదేశాంగ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

ABN , Publish Date - Apr 05 , 2026 | 07:48 AM

భవిష్యత్తులో భారత్ తమపై దాడులకు పాల్పడితే.. కోల్‌కతాను కూడా లక్ష్యంగా చేసుకుంటామని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించారు. ఇటీవల భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఖవాజా మాట్లాడారు.

కోల్‌కతానూ కొట్టగలం.. పాక్ విదేశాంగ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
Khawaja Asif

భవిష్యత్తులో భారత్ తమపై దాడులకు పాల్పడితే.. కోల్‌కతాను కూడా లక్ష్యంగా చేసుకుంటామని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) హెచ్చరించారు. ఇటీవల భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఇరాన్ యుద్ధాన్ని సాకుగా తీసుకుని పొరుగు దేశం ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. రాజ్‌నాథ్ (Rajnath Singh) వ్యాఖ్యలపై తాజాగా పాకిస్థాన్ మంత్రి స్పందించారు.


తన స్వస్థలమైన సియాల్‌కోట్‌లో ఖవాజా ఆసిఫ్ మీడియాతో మాట్లాడారు. 'భవిష్యత్తులో భారత్ మాపై దాడులకు పాల్పడితే.. కోల్‌కతాను లక్ష్యంగా చేసుకుంటాం. మేం చేసే ప్రతి దాడిని కోల్‌కతా వరకు తీసుకెళ్తాం. ఎక్కడో ఒక చోట కొందరి మృతదేహాలను పడేసి.. వారు ఉగ్రవాదులేనని నమ్మించేలా బూటకపు ఆపరేషన్లు చేయడం భారత్‌కు అలవాటు' అంటూ ఖవాజా పేర్కొన్నారు. అయితే ఆయన తన వాదనలకు బలం చేకూర్చేలా ఎలాంటి ఆధారాలనూ చూపించలేకపోయారు (India Pakistan tensions).


గతేడాది ఏప్రిల్ నెలలో ఉగ్రవాదులు పెహల్గామ్‌లో అత్యంత హేయమైన ఘాతుకానికి పాల్పడ్డారు (Pakistan warning India). పర్యాటకుల మతం తెలుసుకుని మరీ కాల్పులు జరిపారు. ఈ ఘటన జరిగి దాదాపు ఏడాది కావస్తున్న సమయంలో తాజాగా రాజ్‌నాథ్ స్పందించారు. 'పహల్గామ్‌లో ఉగ్రవాదులు మతం ఆధారంగా ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఈ దాడి కేవలం భారతదేశంపైనే కాదు, దేశ సామాజిక ఐక్యత, సామాజిక వ్యవస్థపై కూడా జరిగింది' అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.


ఇవి కూడా చదవండి..

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై

ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు

Updated Date - Apr 05 , 2026 | 08:07 AM