Share News

ఆ రాశి వారికి ఈ వారం ఆదాయ వ్యయాలు సంతృప్తికరం

ABN , Publish Date - Apr 05 , 2026 | 07:30 AM

ఆ రాశి వారికి ఈ వారం ఆదాయ వ్యయాలు సంతృప్తికరం.. అనుగ్రహం 5 - 11 ఏప్రిల్‌ 2026 పి.ప్రసూనా రామన్‌

ఆ రాశి వారికి ఈ వారం ఆదాయ వ్యయాలు సంతృప్తికరం

అనుగ్రహం

5 - 11 ఏప్రిల్‌ 2026

పి.ప్రసూనా రామన్‌

మేషం

అశ్విని, భరణి,

కృత్తిక 1వ పాదం

mesham.jpgఅనుకూలతలు అంతంత మాత్రమే. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఆచితూచి అడుగేయాలి. అనుభవజ్ఞులను సంప్రదించండి. తొందరపాటు నిర్ణయం తగదు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ప్రలోభాలకు లొంగవద్దు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. అవకాశాలు కలిసి వస్తాయి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఖర్చులు విపరీతం.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి,

మృగశిర 1,2 పాదాలు

vrushabham.jpgపరిస్థితులు అనుకూలిస్తాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. కార్యం నెరవేరుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ధన సహాయం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. పనులు త్వరితగతిన సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. కీలక పత్రాలు అందుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పిల్లల పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర,

పునర్వసు 1,2,3 పాదాలు

mithunam.jpgఅన్ని విధాలా కలిసివస్తుంది. వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. పరిచ యాలు ఉన్నతికి తోడ్పడతాయి. లక్ష్యం సాధి స్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. రావలసిన ధనం అందుతుంది. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అనవసర విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. మానసిక ప్రశాంతత పొందుతారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.


కర్కాటకం

పునర్వసు 4వ

పాదం, పుష్యమి, ఆశ్లేష

karkatakam.jpgమీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కొత్త యత్నాలు చేపడతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఎదురు చూస్తున్న పత్రాలు అందుకుంటారు. పిల్లల దూకుడు అదుపు చేయండి. చెప్పుడుమాటలు పట్టించుకోవద్దు. ప్రతీ విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. కీలక చర్చల్ల్లో పాల్గొంటారు.


సింహం

మఖ, పుబ్బ,

ఉత్తర 1వ పాదం

simham.jpgలావాదేవీలతో తీరిక ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. పనులుఅస్తవ్యస్తంగా సాగుతాయి. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో అనుకూలతలు నెలకొంటాయి. నోటీసులు అందుకుంటారు. మీ అభిప్రా యాలను కచ్చితంగా తెలియజేయండి.


కన్య

ఉత్తర 2,3,4; హస్త,

చిత్త 1,2 పాదాలు

kanya.jpgకార్యసాధనకు కృషి, పట్టుదల ప్రధానం. ఓర్పుతో యత్నాలు కొనసాగిం చండి. సాయం ఆశించవద్దు. ఖర్చులు విపరీతం. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. పిల్లల ఉన్నత చదువులపై దృష్టి పెట్టండి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పోయాయను కున్న వస్తువులు లభ్యమవుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది.


తుల

చిత్త 3,4; స్వాతి,

విశాఖ 1,2,3 పాదాలు

tula.jpgఅనుకున్న కార్యం నెరవేరు తుంది. సమర్థతను చాటుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పనులు ఒక పట్టాన సాగవు. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సంస్థల స్థాపనకు అనుకూలం. ధనసహాయం తగదు. కీలక పత్రాలు అందుతాయి. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. పిల్లలపై చదువులపై దృష్టి పెడతారు. కుటుంబసౌఖ్యం పొందుతారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

vruchikam.jpgవ్యవహారాల్లో దూకుడుగా వ్యవహరిస్తారు. మీ వైఖరి కొందరికి ఆగ్రహం కలిగిస్తుంది. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. బంధువర్గం వారితో విభేదిస్తారు. కొత్త సమస్య తలెత్తే సూచనలున్నాయి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ,

ఉత్తరాషాఢ 1వ పాదం

dhanussu.jpgసర్వత్రా అనుకూలం. సంప్ర దింపులు సంతృప్తినిస్తాయి. మీ ప్రతిపాద నలకు ఆమోదం లభిస్తుంది. ప్రతీ విషయం లోను ధైర్యంగా ముందుకు సాగుతారు. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్‌ వేసుకుంటారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఫోన్‌ సందేశాలు పట్టించుకోవద్దు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతలి వారి స్తోమతను తెలుసుకోండి. వివాదాలు కొలిక్కివస్తాయి. అనుకున్న మొక్కులు చెల్లించుకుంటారు.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4;

శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

makaram.jpgకార్యసిద్థి, ధనలాభంఉన్నాయి. సంప్రదింపులతో తీరిక ఉండదు. ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగ వద్దు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించదు. ధైర్యంగా ముందుకు సాగుతారు. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. పిల్లల విషయంలో మంచి జరుగుతుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

kumbham.jpgఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు వేగవంతమవుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆత్మీయులతో కాల క్షేపం చేస్తారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. అనవసర జోక్యం తగదు. పిల్లల ఉన్నత చదువులపై దృష్టిసారిస్తారు. గృహనిర్మాణం పూర్తి కావస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు.


మీనం

పూర్వాభాద్ర 4వ

పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

meemam.jpgశ్రమాధిక్యత మినహా ఫలితం శూన్యం. అనుభవజ్ఞులను సంప్రదించండి. భేషజాలకు పోవద్దు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆచితూచి అడుగేయండి. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. కొందరి రాక చికాకుపరుస్తుంది. సామరస్యంగా మెలగండి. పిల్లలకు శుభపరిణామాలున్నాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. కావలసిన పత్రాలు అందుతాయి, ఆత్మీయులతో సంభాషిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మావిగన్‌.. మారీచ!

సీఎస్ఆర్‌ ఫండ్‌ పెరగాలి!

Read Latest Telangana News and National News

Updated Date - Apr 05 , 2026 | 07:30 AM