ఈ రాశి వారికి గుడ్ న్యూస్. జీవితంలో శుభకాలం ప్రారంభం
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:16 AM
నేడు రాశిఫలాలు 5-04-2026- ఆదివారం, ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు...
నేడు రాశిఫలాలు 5-04-2026- ఆదివారం, ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మధ్యాహ్నం నుంచి పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు అధికం. సూర్యభగవానుడిని ఆరాధించండి.

వృషభం ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
కొత్త పరిచయాలు ఉల్లాసం కలిగిస్తాయి. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. మధ్యాహ్నం నుంచి భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పందాలు, పోటీల్లో నష్టపోయే అవకాశం ఉంది. ఆదిత్య హృదయపారాయణ శుభప్రదం.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. మధ్యాహ్నం నుంచి ఫార్మ, హోటల్, రిటైల్ రంగాల వారికి ఆర్థిక విషయాల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితులు మొహమాటపెట్టే అవకాశం ఉంది. సూర్యభగవానుడిని ఆరాధించండి.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. మధ్యాహ్నం నుంచి ఆడిటింగ్, క్రీడలు, అడ్వర్టయిజ్‌మెంట్ రంగాల వారు మాటపడాల్సి వస్తుంది. చిన్నారులు, ప్రియతముల వైఖరిమనస్తాపం కలిగిస్తుంది. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణమాలు జరుగుతాయి. మధ్యాహ్నం నుంచి వేడుకలు, సమావేశాలకు ఏర్పాట్లలో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. బదిలీలు, మార్పుల విషయంలో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అగ్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సూర్యభగవానుడి ఆరాధన శుభప్రదం.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
విద్య, ప్రయాణాలకు అవసరమైన నిధులు సకాలంలో అందుతాయి. మధ్యాహ్నం నుంచి ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడులకు సంబంధించిన చర్చలు ఫలించకపోవచ్చు. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
కొత్త పరిచయాలు లాభిస్తాయి. జనసంబంధాలు విస్తరిస్తాయి. మద్యాహ్నం నుంచి ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పందాలు, పోటీలకు దూరంగా ఉండటం మేలు. వేడుకల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. గోసేవ శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఆరోగ్యం మెరుగుపడుతుంది. మధ్యాహ్నం నుంచి సాధనకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. విందు వినోదాల్లో పరిమితులు పాటించాలి. కొత్త పనుల ప్రారంభం విషయంలో మీ అంచనాలు ఫలించకపోవచ్చు. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.

ధనుస్పు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
పొదుపు పథకాలకు సంబంధించి సమాచారం సేకరిస్తారు. ప్రియతములతో ప్రయాణాలకు అనుకూలం. మధ్యాహ్నం నుంచి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలకు అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. చిన్నారులు, ప్రియతముల విషయాలు మనస్తాపానికి గురిచేస్తాయి. దుర్గామాతను ఆరాధించండి.

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మధ్యాహ్నం నుంచి పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలకు అనుకూలం కాదు. బృందకార్యక్రమాల కోసం ఖర్చులు అధికం. రియల్ ఎస్టేట్ రంగంలోని వారు ఆచితూచి వ్యవహరించాలి. గోసేవ శుభప్రదం.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
పెద్దలతో చర్చలు, సమావేశాలు ఫలిస్తాయి. మధ్యాహ్నం నుంచి ఒక సమాచారం కలవరపెడుతుంది. తోబుట్టువుల కారణంగా మాటపడాల్సి వస్తుంది. ఇంటర్వ్యూలలో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. సూర్యాష్టక పారాయణ శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
కళలు, రక్షణ, టెలివిజన్ రంగాల వారికి ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి ఆర్థిక విషయాల్లో కొత్త ప్రయోగాలకు దూరంగా ఉండటం మంచిది. వేడుకల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ