ఆఖరి బంతికి ఇంగ్లండ్ బతికిపోయింది
ABN , Publish Date - Feb 09 , 2026 | 06:11 AM
టీ20 ప్రంపచక్‌పలో తొలిరోజు డిఫెండింగ్ చాంపియన్ భారత్‌ను అమెరికా భయపెడితే.. రెండోరోజు పోటీల్లో రెండుసార్లు చాంపియన్ ఇంగ్లండ్‌ను చిట్టిపొట్టి జట్టు నేపాల్ వణికించింది...
నేటి మ్యాచ్‌లు
స్కాట్లాండ్ X ఇటలీ (ఉ. 11 గం. నుంచి)
జింబాబ్వే X ఒమన్ (మ.3 గం.)
దక్షిణాఫ్రికా X కెనడా (రా.7 గం.)
4 పరుగులతో గెలుపు
వణికించిన నేపాల్
పోరాడిన లోకేష్
ముంబై: టీ20 ప్రంపచక్‌పలో తొలిరోజు డిఫెండింగ్ చాంపియన్ భారత్‌ను అమెరికా భయపెడితే.. రెండోరోజు పోటీల్లో రెండుసార్లు చాంపియన్ ఇంగ్లండ్‌ను చిట్టిపొట్టి జట్టు నేపాల్ వణికించింది. 185 పరుగుల లక్ష్య ఛేదనలో నేపాల్ ఆఖరి బంతి దాకా పోరాడింది. మ్యాచ్‌లో ఓడినా అద్భుత ప్రదర్శనతో భళా అనిపించింది. మొత్తంగా ఆదివారం అత్యంత ఉత్కంఠగా జరిగిన ఈ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు నాలుగు పరుగులతో గెలుపొంది ఊపిరి పీల్చుకుంది. తొలుత ఇంగ్లండ్ 20 ఓవర్లలో 184/7 స్కోరు చేసింది. జాకబ్ బెతెల్ (35 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. విల్ జాక్స్ (18 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్స్‌లతో 39 నాటౌట్) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్, నందన్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో 180/6 స్కోరు చేసి ఓడింది. దీపేంద్ర సింగ్ (29 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 44), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39), ఓపెనర్ కుశాల్ బుర్తెల్ (17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 29) రాణించారు. దీపేంద్ర, రోహిత్ మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. ఇక..ఆఖర్లో లోకేష్ బామ్ (20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో నేపాల్‌ను విజయం అంచుల దాకా తీసుకొచ్చాడు. చివరి బంతికి ఆరు పరుగులు కావాల్సిన దశలో సింగిలే రావడంతో నేపాల్‌కు ఓటమి తప్పలేదు. లియామ్ డాసన్ రెండు వికెట్లు సాధించాడు. ఆర్చర్, జాక్స్, కర్రాన్ తలో వికెట్ తీశారు. ఆల్‌రౌండ్ షో చేసిన విల్ జాక్స్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
సంక్షిప్తస్కోర్లు
ఇంగ్లండ్: 20 ఓవర్లలో 184/7 (బెతెల్ 55, బ్రూక్ 53, జాక్స్ 39 నాటౌట్; దీపేంద్ర 2/23, నందన్ 2/25).
నేపాల్: 20 ఓవర్లలో 180/6 (దీపేంద్ర 44, రోహిత్ 39, లోకేష్ 39 నాటౌట్, కుషాల్ 29; డాసన్ 2/21).
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్-2026: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం..