Share News

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై

ABN , Publish Date - Apr 04 , 2026 | 06:00 PM

తమిళనాడు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై బీజేపీ రాష్ట్ర విభాగం మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరాదని తాను నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై
K Annamalai

చెన్నై: తమిళనాడు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై బీజేపీ రాష్ట్ర విభాగం మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై (K Annamalai) స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరాదని తాను నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఇదే విషయన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, పార్టీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు తెలియజేసినట్టు చెప్పారు. కేరళలోని కన్నూరులో ప్రచారం అనంతరం శనివారంనాడు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు.


'ఏ నియోజకవర్గానికి పోటీ చేసేది లేదని లిఖిత పూర్వకంగా పార్టీ కోర్ కమిటీకి తెలియజేశాను. అధిష్ఠానం ఆమోదానికి పంపిన పేర్ల జాబితాలో కూడా నాపేరు లేదు. అందువల్ల నాకు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడం అనేదే లేదు. నేనే పోటీకి దూరంగా ఉన్నాననేది నిజం. మీడియాలో దీనిపై చర్చకు వచ్చినందునే ఈ వివరణ ఇస్తున్నాను' అని అన్నామలై చెప్పారు.


ప్రస్తుతం పుదుచ్చేరి, కేరళలో ఏప్రిల్ 7 వరకూ ప్రచార బాధ్యతలను పార్టీ తనకు అప్పగించిందనీ, 7వ తేదీ నుంచి 23 వరకూ తమిళనాడులో ప్రచారం ఉంటుందనీ తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతకు న్యాయం చేస్తానని చెప్పారు. కాగా, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు స్థానాలకు ఇన్‌చార్జిగా అన్నామలై ఉన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 23న ఒకే విడతలో జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు

ట్రంప్ నియంత్రణలో మోదీ, ఆయన నియంత్రణలో పినరయి... రాహుల్ విసుర్లు

Updated Date - Apr 04 , 2026 | 06:41 PM