శశిథరూర్ కాన్వాయ్‌ని అడ్డుకున్న జనం.. సెక్యూరిటీ గార్డ్‌పై దాడి..
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:18 AM
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌కు చేదు అనుభవం ఎదురైంది. మలప్పురం జిల్లాలో కొంతమంది జనం శశిథరూర్ కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. ఆయన సెక్యూరిటీ టీమ్‌లోని సభ్యుడిపై దాడి చేశారు.
తిరువనంతపురం, ఏప్రిల్ 4: కేరళంలో ఏప్రిల్ 9వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. స్టార్ క్యాంపైనర్లను రంగంలోకి దించుతున్నాయి. శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కేరళంలోని వండూర్‌లో ప్రచారం నిర్వహించడానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. మలప్పురం జిల్లాలో కొంతమంది జనం శశిథరూర్ కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. ఆయన సెక్యూరిటీ టీమ్‌లోని సభ్యుడిపై దాడి చేశారు.
ఈ సమయంలో కారులో శశిథరూర్‌తో పాటు తిరువనంతపురం ఎంపీ కూడా ఉన్నారు. పెద్ద సంఖ్యలో చుట్టుముట్టిన జనం లోపల ఉన్న వారిపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే వారిని అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరిపై దాడి చేశారు. ఈ విషయాన్ని శశిథరూర్ ధ్రువీకరించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో శనివారం ఉదయం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘గత రాత్రి నా సెక్యూరిటీ గార్డ్‌పై జరిగిన దాడి గురించి చాలా మంది నాకు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నారు. అతడు బాగానే ఉన్నాడు. నన్ను ఎవరూ టచ్ చేయలేదు. నా స్నేహితులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు.
ఇక, ఈ సంఘటనపై శశిథరూర్ సెక్యూరిటీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాలను సీజ్ చేశారు. ఉమ్మర అనే వ్యక్తిపై నాన్ బెయిలబుల్ కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి
పెట్రోల్ ధరలు భారీగా తగ్గించిన పాక్ ప్రభుత్వం.. కొన్ని నగరాల్లో ఉచిత రవాణా సౌకర్యం..
రాజమండ్రిలో మరోసారి బయటపడ్డ పాల కల్తీ