Share News

క్రైస్తవులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు

ABN , Publish Date - Apr 05 , 2026 | 08:35 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవ సోదరులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈస్టర్ పండుగ ప్రేమ, విశ్వాసం, నమ్మకం లాంటి పవిత్ర భావనలను పాదుగొలిపే పవిత్ర దినమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

క్రైస్తవులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు
Chandrababu Naidu Easter wishes,

అమరావతి, ఏప్రిల్ 5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవ సోదరులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈస్టర్ పండుగ ప్రేమ, విశ్వాసం, నమ్మకం లాంటి పవిత్ర భావనలను పాదుగొలిపే పవిత్ర దినమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఆదివారం ఓ పోస్టు పెట్టారు.


ఆ పోస్టులో.. ‘పాపుల కోసం శిలువనెక్కిన ఏసు ప్రభువు పునరుత్థానం చెందిన పవిత్రమైన ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు. ఈస్టర్ పండుగ ప్రేమ, విశ్వాసం, నమ్మకం లాంటి పవిత్ర భావనలను పాదుగొలిపే పవిత్ర దినం. పాప ప్రక్షాళన కోసం క్రీస్తు చేసిన త్యాగం మనకు ఆదర్శం కావాలి. ఆయన చూపిన శాంతి మార్గంలో నడుస్తూ మీరు మీ కుటుంబ సభ్యులు కలకాలం ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

‘ఇన్‌స్టా’ నిండా రకరకాల, రంగురంగుల సలాడ్స్‌...

మీది చురుకైన చూపు అయితే.. ఈ ఫొటోలో పిల్లి ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Apr 05 , 2026 | 08:38 AM