Share News

ఇరాన్‌లో 3,500 మంది.. ఇజ్రాయెల్‌లో 19 మంది.. పశ్చిమాసియాలో భారీ ప్రాణ నష్టం..

ABN , Publish Date - Apr 04 , 2026 | 12:38 PM

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడి చేయడంతో ప్రారంభమైన యుద్ధం ఆరో వారానికి చేరుకుంది. ఈ యుద్ధ ప్రభావం ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్‌తో పాటు గల్ఫ్ దేశాలకు, ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలకు తీవ్ర నష్టం కలిగించింది.

ఇరాన్‌లో 3,500 మంది.. ఇజ్రాయెల్‌లో 19 మంది.. పశ్చిమాసియాలో భారీ ప్రాణ నష్టం..
US Israel Iran war

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడి చేయడంతో ప్రారంభమైన యుద్ధం ఆరో వారానికి చేరుకుంది. ఈ యుద్ధ ప్రభావం ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్‌తో పాటు గల్ఫ్ దేశాలకు, ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలకు తీవ్ర నష్టం కలిగించింది. భారీగా ఆర్థిక నష్టం మాత్రమే కాదు.. ప్రాణ నష్టం కూడా సంభవించింది. ముఖ్యంగా ఇరాన్‌లో వేల మంది ఈ యుద్ధం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో వందల మంది గాయపడ్డారు (US Israel Iran war).


యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్‌లో 3,531 మంది మరణించారని అమెరికాకు చెందిన హక్కుల సంఘం హెచ్‌ఆర్‌ఏఎన్‌ఏ తెలిపింది. వీరిలో 1,607 మంది సామాన్య పౌరులు ఉన్నారని తెలిపింది. వీరిలో 244 మంది పిల్లలు కూడా ఉన్నారని పేర్కొంది. క్షేత్రస్థాయి నివేదికలు, స్థానికుల సమచారం, వైద్య, అత్యవసర వనరులు, అధికారిక ప్రకటనల ఆధారంగా తాము సేకరించిన సమాచారం ప్రకారం ఇరాన్‌లో 3500 మందికి పైగా చనిపోయారని పేర్కొంది (Iran war casualties 2026).


మరోవైపు రెడ్‌క్రాస్ మాత్రం.. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్‌లో ఇప్పటివరకు కనీసం 1,900 మంది మరణించగా, 20,000 మంది గాయపడ్డారని పేర్కొంది. ఇక, మార్చి 2 నుంచి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 124 మంది చిన్నారులతో సహా దాదాపు 1,368 మంది లెబనాన్ పౌరులు మరణించారని లెబనీస్ అధికారులు చెబుతున్నారు. ఇక, లెబనీస్ సాయుధ సంస్థ హిజ్బుల్లాకు చెందిన 400 మంది సైనికులు మరణించారని సమాచారం. అలాగే ఈ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాక్‌లో 108 మంది మరణించారట (Israel Iran conflict).


ఇరాన్, లెబనాన్ నుంచి ప్రయోగించిన క్షిపణుల దాడిలో ఇజ్రాయెల్‌లో 19 మంది మరణించినట్లు ఇజ్రాయెల్ అంబులెన్స్ సర్వీస్ తెలిపింది (war week 6 update). దక్షిణ లెబనాన్‌లో తమకు చెందిన 10 మంది సైనికులు మరణించారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఇక, ఈ యుద్ధంలో అమెరికాకు చెందిన పదమూడు మంది సైనికులు మరణించారు. అమెరికా సైనిక ఇంధన సరఫరా విమానం కూలిపోవడంతో ఆరుగురు మరణించినట్లు అమెరికా సైన్యం తెలిపింది. కాగా మరో ఏడుగురు ఇరాన్‌ క్షిపణి దాడుల కారణంగా మరణించినట్టు పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

48 గంటల కాల్పుల విరమణ.. అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్..


స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Apr 04 , 2026 | 12:38 PM