విమానంలో ప్రయాణికుడి వికృత చేష్టలు.. నటికి చేదు అనుభవం..
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:37 AM
తాజాగా ఓ నటికి విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. సాటి ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన కారణంగా ఆమె తీవ్రంగా ఇబ్బంది పడింది. తనకు ఎదురైన అనుభవంపై ఆమె ఓ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
తాజాగా ఓ నటికి విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. సాటి ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన కారణంగా ఆమె తీవ్రంగా ఇబ్బంది పడింది. తనకు ఎదురైన అనుభవంపై ఆమె ఓ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నటి, కంటెంట్ క్రియేటర్ ఉర్వి కొఠారి విమాన ప్రయాణ సమయంలో తోటి ప్రయాణికుడి ప్రవర్తన వల్ల తీవ్రంగా ఇబ్బంది పడినట్టు తెలిపింది (Actress complaint plane).
ఉర్వి కొఠారి షేర్ చేసిన వీడియో ప్రకారం.. ఆమె విమానంలో తన సీటులో కూర్చుని ఉండగా వెనుక ఉన్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. తన చేతులను ఉర్వి కూర్చున్న సీటుపై పెడుతూ ఆమెను తాకేందుకు ప్రయత్నించాడు. దీంతో ఉర్వి విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వారు వచ్చి ఆ ప్రయాణికుడిని హెచ్చరించారు. అయినప్పటికీ అతడి తీరు మారలేదు. కాసేపటి తర్వాత ఆ వ్యక్తి తన కాళ్లను ఉర్వి కూర్చున్న సీటు ఆర్మ్ రెస్ట్‌పై పెట్టాడు. దీంతో చేసేదేమీ లేక ఉర్వి తన సీటును మార్చుకుంది (Passenger behaviour flight).
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 1.4 కోట్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు (Flight viral video). ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించాల్సిందని కొందరు కామెంట్లు చేయగా, మరికొందరు అలాంటి వారిని చితకబాదాలని పేర్కొన్నారు. మరికొందరు మాత్రం ఉర్విని విమర్శించారు. 'వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టే బదులు, అక్కడే గట్టిగా నిలదీయవచ్చు కదా?', 'కేవలం ఫేమ్ కోసమే ఇలాంటి వీడియోలు పెడుతున్నారు' అంటూ కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
48 గంటల కాల్పుల విరమణ.. అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్..
స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..