ఇరాన్‌తో ఘర్షణలు.. అబుధాబీలో ఐదుగురు భారతీయులకు గాయాలు
ABN , Publish Date - Apr 03 , 2026 | 10:07 PM
శుక్రవారం ఇరాన్ ప్రయోగించిన మిసైల్‌ను అబుధాబీ మార్గమధ్యంలోనే అడ్డుకుంది. అయితే, కొన్ని శకలాలు తగలడంతో అబుధాబిలో 12 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారని ప్రభుత్వ మీడియా కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఇరాన్ ప్రయోగించిన మిసైల్‌ను అబుధాబీ మార్గమధ్యంలోనే అడ్డుకుంది. అయితే, కొన్ని శకలాలు తగలడంతో అబుధాబిలో 12 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారని ప్రభుత్వ మీడియా కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అజ్బాన్ ప్రాంతంలో ఈ గటన జరిగిందని తెలిపింది. ఇరాన్ మిసైల్‌ను అడ్డుకునే క్రమంలో కొన్ని శకలాలు అక్కడున్న స్థానికులను గాయపరిచినట్టు ప్రభుత్వం వెల్లడించింది. బాధితుల్లో కొందరికి స్వల్ప గాయాలు మరికొందరికి ఓ మోస్తరు గాయాలు అయ్యాయని తెలిపింది. గాయపడ్డ వారిలో ఆరుగులు నేపాలీలు, ఐదుగురు భారతీయులు ఉన్నారని తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈస్టర్ ఆదివారం నాడు చర్చిలు మూసే ఉంటాయని అక్కడి వర్గాలు తెలిపాయి.
ఇకపై అమెరికన్ కంపెనీలను కూడా టార్గెట్ చేస్తామని ఇటీవల ఇరాన్ సైనిక దళం ఐఆర్‌సీజీ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇరాన్ నేలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో పాలుపంచుకుంటున్నందుకు అమెరికన్ కంపెనీలు తమ టార్గట్‌లేని ఐఆర్‌సీజీని వెల్లడించింది. ఆయా సంస్థల్లోని ఉద్యోగులు వెంటనే వెళ్లిపోవాలని కూడా సూచించింది.