స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర అమెరికా ఫైటర్ జెట్‌ను కూల్చేసిన ఇరాన్
ABN , Publish Date - Apr 04 , 2026 | 07:09 AM
అమెరికాకు చెందిన అమెరికన్ ఏ-10 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసింది. శుక్రవారం స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర అమెరికన్ ఏ-10 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసిందని తస్‌నిమ్ న్యూస్ ఎజెన్సీ తెలిపింది.
టెహ్రాన్, ఏప్రిల్ 4: ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం 37వ రోజుకు చేరుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేస్తున్నాయి. ఇరాన్‌లోని కరజ్ ప్రాంతంలో ఉన్న అత్యంత ఎత్తైన 'బీ1' బ్రిడ్జ్‌ని గురువారం ధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడుల్లో బీ1 బ్రిడ్జ్ పాక్షికంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. శుత్రు దేశాలపై ప్రతీకార దాడులకు సిద్ధమైంది. గల్ఫ్, జోర్డాన్‌లలోని 8 ప్రముఖ బ్రిడ్జ్‌లను ఐఆర్‌జీసీ టార్గెట్ చేసింది. అంతేకాదు.. అమెరికాకు చెందిన అమెజాన్, ఒరాకిల్ కంపెనీలపై కూడా దాడులు చేస్తామని చెప్పింది.
అమెరికా ఫైటర్ జెట్‌ను కూల్చేసిన ఇరాన్
అమెరికాకు చెందిన అమెరికన్ ఏ-10 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసింది. శుక్రవారం స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర అమెరికన్ ఏ-10 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసిందని తస్‌నిమ్ న్యూస్ ఎజెన్సీ తెలిపింది. ఆర్మీ పబ్లిక్ రిలేషన్ టీమ్ తెలిపిన వివరాల మేరకు.. వ్యూహాత్మక జలమార్గం చుట్టుపక్కల, దక్షిణ దిశలో ఉన్న సముద్ర జలాల్లో సంచరిస్తున్న ఏ-10 విమానాన్ని ఇరాన్ సైన్యం లక్ష్యంగా చేసుకుని పేల్చేసింది. అయితే, ఈ వార్తపై ఇరాన్ సైన్యం నుంచి ఎటువంటి ఖచ్చితమైన ప్రకటనలు రాలేదు. కాగా, ఏ-10 విమానాన్ని క్లోజ్ ఎయిర్ సపోర్ట్ మిషన్ల కోసం అమెరికా తయారు చేసుకుంది. ఇవి గ్రౌండ్ అటాక్ విమానాలు. సాయుధ వాహనాలు, శత్రు సైనికులపై దాడులకు ఏ-10 యుద్ధ విమానాలను వాడుతుంటారు.
గల్ఫ్‌పై ఇరాన్ ఫోకస్..
ఇరాన్ గల్ఫ్ దేశాలే లక్ష్యంగా భీకర దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులకు పాల్పడుతోంది. కువైట్‌లోని మినా అల్- అహ్మదీ చమురు శుద్ధి ఫ్యాక్టరీపై శుక్రవారం దాడి చేసింది. ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అమెరికా నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు దొరక్కపోవటంతో గల్ఫ్ దేశాలు అల్లాడిపోతున్నాయి.
ఇవి కూడా చదవండి
స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..