కాలు బయటపెట్టవద్దు.. ఇరాన్‌లో భారతీయులకు అలర్ట్
ABN , Publish Date - Apr 07 , 2026 | 08:06 PM
ఇరాన్‌లో భారతీయులకు అక్కడి ఇండియన్ ఎంబసీ కీలక సూచన చేసింది. తమ నివాసాల్లోంచి కాలు బయటపెట్టవద్దని పేర్కొంది. మిలిటరీ స్థావరాలు, విద్యుత్ కేంద్రాలకు దూరంగా ఉండాలని పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: గల్ఫ్‌లో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరిన నేపథ్యంలో ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం తాజాగా అలర్ట్ జారీ చేసింది. వచ్చే 48 గంటల పాటు భారతీయులు ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాలని స్పష్టం చేసింది. తమ ఇళ్లల్లోంచి కాలు బయటపెట్టవద్దని తేల్చి చెప్పింది. బహుళ అంతస్తుల భవనాల్లో ఉండేవారు పైఅంతస్తుల్లో ఉండవద్దని సూచించింది. విద్యుత్, మిలిటరీ స్థావరాలకు దూరంగా ఉండాలని కూడా పేర్కొంది. ఇక ఎంబసీ పరిధిలోని హోటళ్లల్లో ఉండేవారు బయటకు రావొద్దని సూచించింది. ఎంబసీకి చెందిన బృందాలతో నిత్యం టచ్‌లో ఉండాలని పేర్కొంది. ఈ మేరకు ఇరాన్‌లో భారతీయ ఎంబసీ కీలక అలర్ట్‌ను జారీ చేసింది.
మీ నాగరికతను అంతం చేస్తామన్న ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ తోసి పుచ్చిన విషయం తెలిసిందే. సైకో హెచ్చరికలను లెక్కచేయబోమని పేర్కొంది. కాలానికి ఎదురు నిలిచిన ఇరాన్ నాగరికతను ట్రంప్ హెచ్చరికలు ఏమీ చేయలేవని పేర్కొంది.