దెబ్బకు దెబ్బ.. 8 గల్ఫ్ బ్రిడ్జ్‌లను టార్గెట్ చేసిన ఇరాన్..
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:20 PM
ఇరాన్ ప్రతీకార దాడులకు సిద్ధమైంది. గల్ఫ్, జోర్డాన్‌లలోని 8 ప్రముఖ బ్రిడ్జ్‌లను ఐఆర్‌జీసీ టార్గెట్ చేసింది. ఈ మేరకు ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ఐఆర్‌జీసీ దాడులు చేయడానికి నిశ్చయించుకున్న బ్రిడ్జ్‌ల లిస్ట్‌ను రిలీజ్ చేసింది.
టెహ్రాన్, ఏప్రిల్ 3: ఇజ్రాయెల్, అమెరికా దళాలు ఇరాన్‌లోని కరజ్ ప్రాంతంలో ఉన్న అత్యంత ఎత్తైన 'బీ1' బ్రిడ్జ్‌ని గురువారం ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడుల్లో బీ1 బ్రిడ్జ్ పాక్షికంగా దెబ్బతింది. ఎనిమిది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రతీకార దాడులకు సిద్ధమైంది. గల్ఫ్, జోర్డాన్‌లలోని 8 ప్రముఖ బ్రిడ్జ్‌లను ఐఆర్‌జీసీ టార్గెట్ చేసింది. ఈ మేరకు ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ఐఆర్‌జీసీ దాడులు చేయడానికి నిశ్చయించుకున్న బ్రిడ్జ్‌ల లిస్ట్‌ను రిలీజ్ చేసింది.
ఇరాన్ హిట్ లిస్ట్‌లో ఉన్న గల్ఫ్, జోర్డాన్‌లోని ప్రముఖ బ్రిడ్జ్‌లు ఇవే..
షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబా సీ బ్రిడ్జ్ (కువైట్)
షేక్ జాయెద్ బ్రిడ్జ్ (యు.ఏ.ఈ)
అల్ మఖ్తా బ్రిడ్జ్ (యు.ఏ.ఈ)
షేక్ ఖలీఫా బ్రిడ్జ్ (యు.ఏ.ఈ)
కింగ్ ఫహద్ కాజ్వే (సౌదీ అరేబియా–బహ్రెయిన్)
కింగ్ హుస్సేన్ బ్రిడ్జ్ (జోర్డాన్)
దామియా బ్రిడ్జ్ (జోర్డాన్)
అబ్దున్ బ్రిడ్జ్ (జోర్డాన్)
అమెజాన్, ఒరాకిల్‌పై దాడులు..
అమెరికాకు చెందిన రెండు డేటా సెంటర్లపై అతి త్వరలో దాడులు చేయబోతున్నామని రెవల్యూషనరీ గార్డ్స్ నేవీ కమాండ్ తస్‌నిమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లోని ఒరాకిల్ డేటా సెంటర్‌పై, బహ్రెయిన్‌లోని అమెజాన్ డేటా సెంటర్‌పై చేస్తామని ఆయన చెప్పారు. శుక్రవారం అమెజాన్‌తో పాటు ఒరాకిల్‌పై ఇరాన్ దాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై దుబాయ్ మీడియా ఆఫీస్ స్పందించింది. ఒరాకిల్ ఆఫీస్‌పై దాడులు జరిగాయంటూ వస్తున్న వార్తలు ఫేక్ అని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
సెలవుల ఎఫెక్ట్.. విమాన చార్జీలకు రెక్కలు
తప్పుచేసే పోలీసులను ప్రశ్నించడం తప్పా: పేర్ని నాని