హోర్ముజ్‌ను దాటిన మరో నౌక.. భారత్ వైపు సేఫ్‌గా జర్నీ
ABN , Publish Date - Apr 05 , 2026 | 03:06 PM
గ్రీన్ ఆశా అనే మరో సరకు రవాణా నౌక సురక్షితంగా హోర్ముజ్‌ను దాటింది. ఎల్‌పీజీతో ఉన్న ఈ నౌక భారత్ వైపు బయలుదేరినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: గ్రీన్ ఆశా అనే మరో సరకు రవాణా నౌక సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటింది. ఎల్‌పీజీతో ఉన్న ఈ నౌక ప్రస్తుతం భారత్‌కు వస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. హోర్ముజ్‌ను సురక్షితంగా దాటిన తొమ్మిదవ భారత సరకు రవాణా నౌక గ్రీన్ ఆశా కావడం గమనార్హం.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు దాడులు మొదలుపెట్టిన నాటి నుంచి హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ ఆంక్షల కొనసాగుతున్నప్పటికీ భారత్‌కు బయలుదేరిన పలు ట్యాంకర్‌లు సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటగలిగాయి.
భారత నౌకలు సేఫ్‌గా హోర్ముజ్‌ను దాటేందుకు వీలుగా కేంద్రం ఇరాన్‌తో చర్చలు కొనసాగిస్తోంది. తమకు హానితలపెట్టే దేశాల నౌకలకే హోర్ముజ్ మీదుగా అనుమతి ఉండదని ఇరాన్ ఇప్పటికే ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్‌కు తెలిపింది. ఈ ఆంక్షలను మరింత విస్తరించే అవకాశం ఉందని కూడా ఇరాన్ ఇటీవల సంకేతాలిచ్చింది. ప్రపంచ సరకు రవాణాకు కీలకమైన బాబ్ ఎల్ మాండేబ్ జలసంధిని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉందనే సంకేతాలిచ్చింది. ఇక ఆరు వారాలుగా గల్ఫ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
ఈ వార్తలూ చదవండి:
షాకింగ్ వీడియో.. రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగురి మృతి..
చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్.. రెండో పైలట్‌ను రక్షించాం డొనాల్డ్ ట్రంప్..