చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్.. రెండో పైలట్‌ను రక్షించాం డొనాల్డ్ ట్రంప్..
ABN , Publish Date - Apr 05 , 2026 | 11:09 AM
ఇరాన్‌లో చిక్కుకుపోయిన రెండో పైలట్‌ను అమెరికా దళాలు రక్షించాయని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇటీవల అమెరికాకు చెందిన యుద్ధ విమానం 'ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్' ఇరాన్ భూభాగంపై కూలిపోయిన సంగతి తెలిసిందే.
ఇరాన్‌లో చిక్కుకుపోయిన రెండో పైలట్‌ను అమెరికా దళాలు రక్షించాయని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇటీవల అమెరికాకు చెందిన యుద్ధ విమానం 'ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్' ఇరాన్ భూభాగంపై కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రెండో పైలట్ ఇరాన్‌లో చిక్కుకుపోయాడు. అతడిని పట్టుకునేందుకు ఒకవైపు ఇరాన్ దళాలు, మరోవైపు అమెరికా సైన్యం తీవ్రంగా శ్రమించాయి (Trump F-15 rescue).
దేశ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్‌ను అమెరికా సైన్యం నిర్వహించి, పైలట్‌ను కాపాడిందని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం ఆ పైలట్ అమెరికా సైన్యం ఆధీనంలో సురక్షితంగా ఉన్నాడని పేర్కొన్నారు. ఇరాన్‌లోని ప్రమాదకర పర్వత ప్రాంతంలో అతడిని గుర్తించినట్టు తెలిపారు. పైలట్‌ను తీసుకురావడానికి తాను డజన్ల కొద్దీ యుద్ధ విమానాలను పంపానని ట్రంప్ తెలిపారు. రక్షణ చర్యలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే ఆ విషయాన్ని బయటకు చెప్పలేదన్నారు (US crew member rescued Iran).
శత్రువు భూభాగంలోకి వెళ్లి ఓ పైలట్‌ను రక్షించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి అని ట్రంప్ పేర్కొన్నారు (US crew member rescued Iran). ఏ అమెరికన్ యోధుడినీ శత్రు భూభాగంలో ఒంటరిగా వదలిపెట్టబోమని ట్రంప్ అన్నారు. ఇరాన్ గగనతలంపై అమెరికా తిరుగు లేని ఆధిపత్యాన్ని సాధించిందని చెప్పడానికి తాజా ఆపరేషన్ ఓ నిదర్శనమని ట్రంప్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
కోల్‌కతానూ కొట్టగలం.. పాక్ విదేశాంగ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
శుభ్‌మన్ గిల్‌కు గాయం.. జట్టుతో చేరడానికి ఎంత సమయం పడుతుంది..