Share News

ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్ల హతం.. వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు..

ABN , Publish Date - Apr 05 , 2026 | 10:38 AM

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై భీకర దాడులకు పాల్పడినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన అగ్రశ్రేణి మిలిటరీ నాయకులు చనిపోయారని వెల్లడించారు. ఆ దాడులకు సంబంధించిన వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్‌లో పోస్ట్ చేశారు.

ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్ల హతం.. వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు..
Donald Trump Iran strike

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై భీకర దాడులకు పాల్పడినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన అగ్రశ్రేణి మిలిటరీ నాయకులు చనిపోయారని వెల్లడించారు. ఆ దాడులకు సంబంధించిన వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్‌లో పోస్ట్ చేశారు. అయితే చనిపోయిన ఆ ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్లు ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు (Donald Trump Iran strike).


'టెహ్రాన్‌పై భీకర దాడులు జరిగాయి. ఇరాన్‌ను అవివేకంగా నడిపించిన ఆ దేశ సైనిక నాయకుల్లో అనేక మంది ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు' అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అయితే ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఇరాన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. 48 గంటల్లోగా హోర్ముజ్‌ను తెరవాలంటూ ఇరాన్‌కు ట్రంప్ సూచించిన సంగతి తెలిసిందే. ఇరాన్ నుంచి స్పందన లేకపోవడంతోనే తాజా దాడులు జరిగినట్టు సమాచారం (Iran military leaders killed).


మరోవైపు, ఆదివారం తెల్లవారుజామున కువైట్‌పై ఇరాన్ భీకర దాడులు చేసింది. షువైఖ్ ఆయిల్ సెక్టార్ కాంప్లెక్స్‌పై డ్రోన్‌తో దాడి చేసింది (Tehran attack video). ఈ దాడి కారణంగా భారీ ఆస్తి నష్టం సంభివించింది. అయితే ఎవరికీ గాయాలు కాలేదని కువైట్ అధికారులు వెల్లడించారు. భారీగా దూసుకువస్తున్న క్షిపణులను, డ్రోన్‌లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకుంటున్నాయని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

కోల్‌కతానూ కొట్టగలం.. పాక్ విదేశాంగ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..


శుభ్‌మన్ గిల్‌కు గాయం.. జట్టుతో చేరడానికి ఎంత సమయం పడుతుంది..

Updated Date - Apr 05 , 2026 | 10:38 AM