షాకింగ్ వీడియో.. రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగురి మృతి..
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:02 PM
బ్రెజిల్‌లో ఓ షాకింగ్ ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ బ్రెజిల్ రాష్ట్రమైన రియో గ్రాండే డో సుల్‌లో ఒక విమానం ఓ రెస్టారెంట్‌లోకి దూసుకుపోయింది. భారీగా మంటలు చెలరేగడంతో నలుగురు మరణించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్రెజిల్‌లో ఓ షాకింగ్ ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ బ్రెజిల్ రాష్ట్రమైన రియో గ్రాండే డో సుల్‌లో ఒక విమానం ఓ రెస్టారెంట్‌లోకి దూసుకుపోయింది. భారీగా మంటలు చెలరేగడంతో నలుగురు మరణించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటల తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో పైలట్, ముగ్గురు ప్రయాణికులు మరణించినట్లు అగ్నిమాపక సిబ్బంది ధ్రువీకరించారు (Brazil plane crash).
రియో గ్రాండేలో కాపావో డా కానోవా విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఓ రెస్టారెంట్‌లోకి ఓ తేలికపాటి విమానం దూసుకెళ్లింది. విమానాశ్రయంలో రన్‌వే చివరన ఉన్న ఒక స్తంభాన్ని ఢీకొట్టడంతో అదుపు తప్పిన విమానం నేరుగా రెస్టారెంట్ లోపలికి వెళ్లిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ రెస్టారెంట్ మూసి ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రెస్టారెంట్ మొత్తం మంటల్లో కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న నలుగురూ మరణించారు (Aircraft crash restaurant).
ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి, సమీపంలో నివసిస్తున్న పౌరులను రక్షణ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి (Small plane crash). సమీపంలో మూసి ఉన్న ఒక దుకాణం కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతిన్నట్లు స్థానిక అధికారులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
కోల్‌కతానూ కొట్టగలం.. పాక్ విదేశాంగ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
శుభ్‌మన్ గిల్‌కు గాయం.. జట్టుతో చేరడానికి ఎంత సమయం పడుతుంది..