Share News

ఇరాన్ పునర్నిర్మాణానికి కదలి రండి: మొజ్తాబా ఖమేనీ పిలుపు

ABN , Publish Date - Apr 02 , 2026 | 11:07 AM

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా దెబ్బతిన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి ముందుకు రావాలని ఇరాన్ ప్రజలకు ఆ దేశ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ పిలుపునిచ్చారు.

ఇరాన్ పునర్నిర్మాణానికి కదలి రండి: మొజ్తాబా ఖమేనీ పిలుపు
Mojtaba Khamenei

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా దెబ్బతిన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి ముందుకు రావాలని ఇరాన్ ప్రజలకు ఆ దేశ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ పిలుపునిచ్చారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ అకారణంగా దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. ఇస్లామిక్ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన ఓ సందేశం విడుదల చేశారు (Mojtaba Khamenei Message).


అమెరికా-ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాక్రమణ దాడుల వల్ల ఇరాన్ మౌలిక సదుపాయాలతో పాటు పర్యావరణం కూడా తీవ్రంగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇరాన్ వాసులందరూ ప్రస్తుతం దేశ అంతర్గత అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు. అభివృద్ధిని విస్తరించడంతో పాటు ఇరాన్ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం పాటు పడాల్సిన అవసరం ఉందన్నారు (Iran infrastructure rebuild).


మినాబ్ పాఠశాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడి చేసి 186 మందిని హతం చేసిన ఘటనపై కూడా మొజ్తాబా స్పందించారు. మినాబ్ పాఠశాలలో చనిపోయిన వారికి నివాళిగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మొక్కలు నాటే (saplings of hope Iran) కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని మొజ్తాబా పిలుపునిచ్చారు. యుద్ధంలో చనిపోయిన అమర వీరులను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.


ఇవి కూడా చదవండి..

ఇండోనేషియాను వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..


పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Apr 02 , 2026 | 11:11 AM